Prakash Raj : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి పాత్రలోనైనా అద్భుతంగా ఒదిగిపోయే సామర్థ్యం ఉంది ప్రకాష్ రాజ్ కు. ఎన్నో సినిమాలను కేవలం తన నటనతోనే నిలబెట్టాడు. అలానే ఏ భాషలో సినిమా చేసిన ఆ భాష నేర్చుకొని స్వయంగా డబ్బింగ్ చెప్పడం కూడా ప్రకాష్ రాజ్ లోని బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇక ప్రకాష్ రాజ్ కేవలం నటుడు గానే కాకుండా రచయితగా దర్శకుడుగా కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన మా ఊరి రామాయణం వంటి సినిమా మంచి ప్రశంసలను పొందుతుంది. తెలుగు సాహిత్యం మీద కూడా ప్రకాష్ రాజ్ మంచి అవగాహన ఉంది. కేవలం నటించడం మాత్రమే కాకుండా అద్భుతమైన పోయెట్రీ కూడా రాస్తూ ఉంటారు.
చాలామంది యంగ్ దర్శకులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి దర్శకులకి ఇంత పేరు రావడానికి కారణం ప్రకాష్ రాజ్ అని చెప్పాలి. ఒక సీన్ ని ఇంతకంటే బలంగా రాయొచ్చు అని నిత్యం దర్శకులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అలానే తెలుగు దర్శకుడు కృష్ణవంశీతో మంచి పరిచయం కూడా ఉంది. పూరి జగన్నాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి స్టార్ దర్శకులతో మంచి పరిచయం ఉంది. ప్రకాష్ రాజ్ కి ఒక నటుడుగా ఎంత పేరు ఉందో అలానే చాలా కాంట్రవర్సీలు కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆగడు సినిమా టైంలో చాలా ఓపెన్ గా శ్రీనువైట్ల పైన కామెంట్ చేశాడు. అలానే శ్రీను వైట్ల కూడా ప్రకాష్ రాజ్ మీద కామెంట్స్ చేశాడు. ఇక ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఇప్పటికీ చాలా ట్వీట్లు చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్.
ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. బద్రి వంటి సినిమాలో వీళ్ళ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా హీరో విలన్లా ప్రవర్తిస్తుంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ సభలు కూడా పెడుతున్న సంగతి తెలిసిందే. దానిపైన ప్రకాష్ రాజ్ స్పందించారు. స్పందించడం మాత్రమే కాకుండా ఉదయనిది స్టాలిన్ లాంటి డిప్యూటీ సీఎంతో పోల్చి పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకంత కోపం అని అడిగినప్పుడు, పవన్ కళ్యాణ్ మూర్ఖత్వ రాజకీయాలు చేస్తున్నాడు అంటూ కామెంట్ చేశాడు. అయితే అతను నమ్మిన ప్రజలుది తప్పంటారని అడిగినప్పుడు, ఆయనను ఇలాంటి వాటికోసం ప్రజలు ఎన్నుకోలేదు అంటూ సమాధానం ఇచ్చాడు.