Amaran.. సినీ పరిశ్రమలో నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి (Sai Pallavi) ప్రస్తుతం కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్ (Shiva Karthikeyan) కు జోడిగా అమరన్ (Amaran)అనే చిత్రంలో నటిస్తోంది. దివంగత ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ (Major Mukund Varadarajan )జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా తమిళ్, తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియస్వామి (Raj Kumar periyasami) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. రాజ్ కమల్ బ్యానర్ పై కమలహాసన్ (Kamal Hassan), సోనీ పిక్చర్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్, ట్రైలర్, సాంగ్స్, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో సాయి పల్లవి తన నటనతో అందరిని అబ్బురపరిచింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అని అభిమానులే కాదు ఆడియన్స్ సైతం ఎదురుచూస్తున్నారు.
మేజర్ ముకుంద్ జీవిత కథ ఆధారంగా అమరన్..
ఇకపోతే మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ నటిస్తూ ఉండగా.. ఆయన భార్య ఇందు రెబికా వర్గీస్ (Indhu Rebecca Vargheese ) పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది.. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్ , ట్రైలర్ చూస్తే మాత్రం వీరిద్దరి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా పండింది అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో గత కొద్దిరోజులుగా సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయింది చిత్ర బృందం. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమా కోసం సాయి పల్లవి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అమరన్ కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్..
సాధారణంగా సౌత్ సినీ పరిశ్రమలో సమంత (Samantha ), నయనతార (Nayanatara)మినహా చాలామంది రూ .2కోట్లకు మించి పారితోషకం తీసుకోవడం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వీరందరూ కుళ్ళుకునేలా సాయి పల్లవి మరో అడుగు ముందుకు వేసిందని సమాచారం. ఇండస్ట్రీలో నటించింది కొన్ని సినిమాలలో అయినా ఇప్పుడు అమరన్ కోసం ఇందు పాత్రలో నటించడానికి ఏకంగా రూ .3కోట్లు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అక్టోబర్ 31న దీపావళి కానుకగా అమరన్ విడుదల..
అమరన్ సినిమా విషయానికి వస్తే… 2024లో విడుదల కాబోతున్న తెలుగు సినిమా ఇది. కాశ్మీర్ నేపథ్యంలో శివార్ రాహుల్ సింగ్ రాసిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత సంఘటనల ఆధారంగా.. ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ : ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ అనే పుస్తకంలో కొన్ని అంశాలను తీసుకొని.. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ,గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కమల్ ఫిలిం బ్యానర్లపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ఏది ఏమైనా సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.