EPAPER

Musk Putin Contact: పుతిన్‌, ఎలన్ మస్క్‌ మధ్య రెండేళ్లుగా సంప్రదింపులు.. తైవాన్‌పై చైనా కుట్ర?

Musk Putin Contact: పుతిన్‌, ఎలన్ మస్క్‌ మధ్య రెండేళ్లుగా సంప్రదింపులు.. తైవాన్‌పై చైనా కుట్ర?

Musk Putin Contact| ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిజినెస్ మెన్ ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరపున ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎలన్ మస్క్, అమెరికా శత్రుదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో గత రెండు సంవత్సరాలుగా సంప్రదింపులు చేస్తున్నారని ప్రముఖ వార్త సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా నివేదికలో వెల్లడైంది. ఇంతకుముందు డానాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. రష్యాను అప్రత్యక్షంగా సమర్థించారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్, పుతిన్ మధ్య సంప్రదింపుల కోణం మరో వారం రోజుల్లో జరుగబోయే అమెరికా ఎన్నికల్లో కీలకంగా మారింది.


వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఎలన్ మస్క్, పుతిన్ మధ్య చాలా కాలంగా కీలక అంతర్జాతీయ రాజకీయాలు, బిజినెస్ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా, యూరోప్, రష్యా దేశాల ప్రస్తుత, మాజీ అధికారులు నుంచి వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా సంస్థ ఈ వివరాలు సేకరించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. తైవాన్ లో ఎలన్ మస్క్ తన స్టార్ లింక్ సాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ని తైవాన్ లో ప్రారంభించకూడదని పుతిన్ కోరారు. దీని వెనుకాల చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఉన్నారని వారు తెలిపారు.

Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!


ఎలన్ మస్క్ కు ఉన్న బిజినెస్ లు అంతరిక్షం, కమ్యూనికేషన్, సోషల్ మీడియా వంటి కీలక రంగాల్లో ఉండడంతో అమెరికా రక్షణ రంగానికి ముప్పు ఉందని కూడా ఆ అధికారులు హెచ్చరించారు. ఉదాహరణకు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ అమెరికా భూభాగం నుంచి అంతరిక్షంలోకి శాటిలైట్లు లాంచ్ చేస్తుంది. అతని స్టార్ లింక్ కమ్యూనికేషన్ సంస్థను ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగిస్తున్నారు. ఇవన్నీ అమెరికా జాతీయ భద్రతకు కీలకం.

మరోవైపు ది గార్డియన్ వార్తా సంస్థ కూడా ఎలన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఎక్స్ ని రష్యా తప్పుడు ప్రచారం కోసం వినియోగిస్తోందని తెలిపింది. త్వరలో జరుగబోయే అమెరికా ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. ఎలన్ మస్క్ ఆయన ద్వారా ప్రభుత్వ పరిపాలన అంశాల్లో మరింత జోక్యం చేసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ట్రంప్ ఎన్నికల ప్రచారంలో విపరీతంగా ఖర్చు పెడుతున్న మస్క్.. ఆ తరువాత ట్రంప్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఆయనకు కీలక బాధ్యతలు కూడా దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్ గత ప్రభుత్వంలో యూరోప్, రష్యా దేశాలపై నిఘా విభాగంలో పనిచేసిన మాజీ సీనియర్ డైరెక్టర్ ఫియోనా హిల్ మాట్లాడుతూ.. “ప్రపంచంలోని చాలా దేశాలు మిలిటరీపరంగా ఎలన్ మస్క్ కంపెనీలపై ఆధారపడి ఉన్నాయి. ఈ కారణంగా ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఎలన్ మస్క్ కు అన్ని రకాల బహుమానలు ఉంటాయి.” అని ఆమె చెప్పారు.

ఎలన్ మస్క్, పుతిన్ మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కూడా పూర్తిగా తెలియదని.. అంతగా పుతిన్, మస్క్ తమ సంప్రదింపులను రహస్యంగా కొనసాగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.

ఈ విషయంపై మస్క్ ఇంతవరకు స్పందించకపోగా.. రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ స్పందించారు. ఎలన్ మస్క్ తో రష్యా ప్రభుత్వం ఒకసారి మాత్రమే సంప్రదించిందని.. అది కూడా అంతరిక్షం, ఏఐ టెక్నాలజీ విషయంలో మాత్రమే చర్చలు జరిగాయని అన్నారు. అంతే తప్ప రాజకీయంగా తమకు, మస్క్‌తో ఎటువంటి సంబంధాలు లేవని చెప్పారు.

Related News

Biden Diwali Celebrations: అమెరికా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు.. ఇండియన్స్‌కు బైడెన్ దావత్

Israel Truck attack: ఇజ్రాయెల్‌ రాజధానిలో ట్రక్కు దాడి.. 35 మందికి తీవ్ర గాయాలు!

Trump Melania Dance: న్యూయార్క్‌లో అట్టహాసంగా ట్రంప్ ఎన్నికల ప్రచారం.. వేలమంది జనం, సెలబ్రిటీలు, భార్యతో డాన్స్..

22,000 kg cheese stolen: 22 వేల కిలోల జున్ను చోరీ.. చాలా ఈజీగా పనికానిచ్చిన దొంగలు..

Beijing on US Taiwan : తైవాన్ పై గురి పెట్టిన చైనా.. అమెరికా ఎంటర్.. డ్రాగన్ కు ఇక చుక్కలే!

Philippines Storm Trami : ఫిలిప్పీన్స్‌లో ట్రామీ తుపాను విధ్వంసం.. 100 మంది మృతి.. లక్షల్లో నిరాశ్రయులు

Kamala Harris Trump: ‘కమలా హ్యారిస్ వల్ల ప్రపంచ యుద్ధం రావొచ్చు.. రష్యా, చైనాతో ఆమె డీల్ చేయలేదు’

×