Prakash Raj: “నేను మోనార్క్ ని.. నన్ను ఎవరు మోసం చేయలేరు”.. అనే డైలాగ్ తో సుస్వాగతం సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినిమాలలో ఎలా అయితే తాను నమ్మింది నిజం అంటూ ప్రేక్షకులకు విసుగు తెప్పించారో.. నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు అలాగే ప్రవర్తిస్తారని కొంతమంది నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే ఎవరు ఎలాంటి వారైనా సరే బంధం ముందు తలవంచక తప్పదు అని మరొకసారి నిరూపించారు ప్రకాష్ రాజ్. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తారు. అందుకే ప్రకాష్ రాజ్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
కొడుకును ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న ప్రకాష్ రాజ్..
ఇదిలా వుండగా ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రకాష్ రాజ్ మొదట డిస్కో శాంతి(Disco Shanti)చెల్లెలు లలితా కుమారి(Lalitha Kumari)ని వివాహం చేసుకున్నారు . వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానంగా జన్మించారు. అయితే ఒకానొక సమయంలో కొడుకు సిద్దార్థ్ (Siddharth) యాక్సిడెంట్ లో చిన్న వయసులోనే చనిపోవడంతో భార్య లలితా కుమారి నిర్లక్ష్యం వల్లే తన కొడుకు కోల్పోయాడని ,కొడుకు కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన ప్రకాష్ రాజ్ కు ఆ బిడ్డ లేకుండానే పోవడంతో భార్య మీద కోపంతోనే ఆమెకు విడాకులు ఇచ్చారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే నిజానికి వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే అసలు కారణం తెలియదు. కానీ ఈ విషయాలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే 2004లో తన భార్య లలితకు విడాకులు ఇచ్చిన ప్రకాష్ రాజ్, పోనీ వర్మ (Ponee Varma) ను వివాహం చేసుకున్నారు. ఇక ఈమెకు ఒక కొడుకు వేదాంత్ (Vedanth )జన్మించిన విషయం తెలిసిందే. సిద్దార్థ్ ను వేదాంత్ లో చూసుకుంటున్నానని చెప్పి తెలిపారు. ఇకపోతే సిద్దార్థ్ మరణించి ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆ కొడుకుని మర్చిపోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అయి అందరినీ కంటతడి పెట్టించారు ప్రకాష్ రాజ్.
మరణం తప్పదు.. అందుకే మానసికంగా దృఢంగా ఉన్నా..
అలాగే తన కూతుర్ల గురించి మాట్లాడుతూ.. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారికి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఈ కారణంతోనే నన్ను నేను మానసికంగా, దృఢంగా ఉంచుకుంటున్నాను. చావు అనేది తప్పదు అన్నప్పుడు కనీసం ఈ క్షణాన ఆనందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం అంటూ ఆయన తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ అప్పుడప్పుడు ఫైర్ బ్రాండ్ లా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఈయన కన్న కొడుకును తలుచుకొని ఎమోషనల్ అవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.