Nag Ashwin : ప్రస్తుత కాలంలో తెలుగు సినిమా ఏ స్థాయికి వెళ్లిపోయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి భారీ బడ్జెట్ తో ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచ సినిమా అంతా తెలుగు సినిమా వైపు చూస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. బాహుబలి,పుష్ప, ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని మార్చేశాయి అని చెప్పొచ్చు. మరోసారి కల్కి సినిమా వలన తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసి వచ్చింది.కల్కి లాంటి కథను ఆలోచించడమే గొప్ప విషయం అనుకుంటే, ఆ కథను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాడు నాగ అశ్విన్. ప్రతి పాత్రకి కూడా సరైన ప్రాముఖ్యతను ఇచ్చి సినిమాను అద్భుతంగా మలిచాడు.
జూన్ 27న రిలీజ్ అయిన కల్కి సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇండియన్ సినిమా చరిత్రలో వచ్చిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఇది. నాగ్ అశ్విన్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అమితాబచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ తో పాటు ఈ సినిమాలో చాలామంది కనిపించారు. ఇకపోతే ఈ సినిమా నాలుగు భాగాలుగా రానున్నట్లు తెలుస్తుంది.అయితే దీని గురించి మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే పార్ట్ 2 ను అనౌన్స్ చేశారు. ఇంకా ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.
ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా గురించి తప్ప సోషల్ మీడియాలో మరో టాపిక్ లేదు అని చెప్పాలి. అందరూ ఇప్పుడు మహాభారతంలోని కథలను చెబుతూ వస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఒక సినిమా యొక్క స్థాయి ఏంటో శక్తి ఏంటో అర్థం అవుతుంది అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలు ఎస్ఎస్ రాజమౌళి, రాంగోపాల్ వర్మ, అనుదీప్ కె.వి, దుల్కర్ సల్మాన్ వంటి ఎంతోమంది నటులు కనిపించారు.
ఇక ప్రస్తుతం కల్కి 2 సినిమా గురించి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కల్కి సినిమాను మించి ఉండబోతుంది అని తెలుస్తుంది. నిన్న జరిగిన అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు నాగ్ అశ్విన్. ఇక్కడ చాలామంది అశ్విన్ ను కల్కి టు అప్డేట్ గురించి అడిగారు. దానికి ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పారు. యాంకర్ సుమ కూడా కల్కి 2 సినిమాకి మధ్యలో ఏదైనా సినిమా చేసే అవకాశం ఉందా అని అడిగారు. కల్కి 2 సినిమానే రెండు మూడు సినిమాలు తో సమానం మధ్యలో ఇంకో సినిమా చేయట్లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు నాగ్ అశ్విన్. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో నాగ్ అశ్విన్ మరొక సినిమా చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటన్నిటికీ నిన్నటితో చెక్ పెట్టేసాడు నాగి.