Gnanavel Raja: సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ను మొదలుపెట్టి సౌర్యం సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శివ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రమే ఆడింది. ఆ తర్వాత మళ్లీ గోపీచంద్ హీరోగా శంఖం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత సిరితై అనే సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో రవితేజ హీరోగా దరువు అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు శివ.
ఇకపోతే తమిళ్లో అజిత్ హీరోగా వీరం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శివ కెరీర్ కి తిరుగులేకుండా పోయింది. ఇదే సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు. డాలి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత శివ చేసిన వేదాళం సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను బోలా శంకర్ పేరుతో చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా ఇక్కడ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వివేగం, విశ్వాసం సినిమాలు కూడా అక్కడ బాగానే ఆడాయి. ఇక ప్రస్తుతం సూర్య హీరోగా కంగువ అనే సినిమాను చేస్తున్నాడు శివ. ఈ సినిమా నవంబర్ 14వ తారీఖున రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో భారీగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమా మీద మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా దాదాపు 2000 కోట్లకు వసూలు చేస్తుంది అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతోపాటు కంగువ సినిమాతో పోటీగా ఏ సినిమా అయినా రావచ్చు కానీ కంగువ పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు మాత్రం ఏ సినిమా రిలీజ్ అవ్వడానికి సాహసం చేయదు అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇకపోతే రీసెంట్ గా మరోసారి పాన్ ఇండియా రికార్డ్ ఫంక్షన్ డిసెంబర్లో పెడతాను అంటూ నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్ ఈవెంట్ లో మరోసారి చెప్పుకొచ్చాడు జ్ఞానవేల్. రీసెంట్ టైమ్స్ లో సినిమాలన్నీ రెండు పార్ట్స్ గా వస్తున్నాయి. కంగువ (Kanguva Movie) సినిమాకి సంబంధించి కూడా పార్ట్ 2 రాబోతున్నట్లు నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపారు. ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే హీరో కార్తీ స్పెషల్ అపీరియన్స్ ఉంటుందని కొంతమంది అంటూ ఉంటే అజిత్ స్పెషల్ అపీరియన్స్ ఉంటుంది అని ఇంకొంతమంది చెబుతున్నారు. అజిత్ తో వరుస హిట్ సినిమాలు చేశాడు. శివ ఈ సినిమాలో అజిత్ కనిపించిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.