OTT Movies: ప్రముఖ ఓటీటి సంస్థలు కొన్ని ఆడియన్స్ ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొత్త సినిమా రిలీజ్ అయిన నెలలోపే ఓటీటిలోకి వచ్చేస్తుంది. కానీ కొన్ని ఓటీటి సంస్థలు మాత్రం రిలీజ్ అయిన కొన్ని నెలలు లేదా ఏళ్లు గడిచిన హిట్ లేదా డిజాస్టర్ అయిన సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. వాటికి అక్కడ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇక్కడ కూడా భారీ వ్యూస్ ను అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక విషయానికొస్తే.. ప్రముఖ ఓటీటి సంస్థ హన్సిక డిజాస్టర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొని వచ్చింది. అది అతి పెద్ద స్టోరీ ఉన్నా డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి చూసేద్దాం పదండీ..
స్టార్ హీరోయిన్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఆ సినిమాలలో ఎక్కువగా హార్రర్ సినిమాలే ఉండటం విశేషం.. హన్సిక హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ గార్డియన్ థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్కడ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఇక్కడ ఓటీటిలో ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.. ఆ మూవీ వివరాలను చూస్తే.. అక్టోబర్ 30 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.. ఇక గార్డియన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఆహా తమిళ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గార్డియన్ మూవీకి గురు శరవణన్ శబరి దర్శకత్వం వహించాడు. సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్ కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ విజయ్ చందర్ ఈ సినిమాను తెరకేక్కించారు.
హన్సిక లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో నటించడం పై అంచనాలు ఓ రేంజులో ఏర్పాడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చాక అలాంటి టాక్ రాలేదు. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రొటీన్ రివేంజ్ ఫార్ములా స్టోరీ కారణంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా ఈ మూవీ నిలిచింది. ఫస్ట్ వీకెండ్‌లోనే థియేటర్లలో నుంచి బయటకు వచ్చేసింది. ఈ మూవీలో హన్సిక అపర్ణ క్యారక్టర్ లో కనిపిస్తుంది. చిన్నతనం నుంచి దురదృష్టం వెంటాడుతుంటుంది. ఏది కోరుకున్నా అది జరగదు. దాంతో అన్‌లక్కీ అపర్ణ గా ఆమె పేరు మారిపోతుంది. అనుకోకుండా అపర్ణకు క్రిస్టల్ దొరుకుతుంది. దాని తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఏది కోరుకున్నా వెంటనే జరిగిపోతుంది. ఇది ఆ తరువాత భయంకరంగా మారుతుంది. వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ ప్రేక్షకులను భయ పెట్టించాయి. ఆఫీస్‌లో తన ప్రాజెక్ట్ మేనేజర్‌తో పాటు కంపెనీ హెడ్ తమ్ముడి కారణంగా అపర్ణ తో పాటు మిగిలిన ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతుంటారు. వారిద్దరు చనిపోతే బాగుండునని అపర్ణ కోరుకుంటుంది. ఆ కోరిక నెరవేరుతుంది. ఇద్దరు అతి భయంకరంగా చనిపోతారు. ఆ క్రిస్టల్‌లో బంధించబడిన మీరా అనే ఆత్మ కథేమిటి? మీరా ఎలా చనిపోయింది అనేది స్టోరి.. ఈ సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..