Tvk Party Mahanadu: శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు తలపతి విజయ్. అయితే అంతకుముందు విజయ్ చాలా సినిమాలు చేసినా కూడా తెలుగు వాళ్లకి పెద్దగా పరిచయం లేదు. విక్రమ్, విశాల్, సూర్య వంటి తమిళ్ నటులు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు అప్పట్లో బాగా పరిచయం. ఇక రజనీకాంత్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్లు పరభాష నటులని ఏ రోజు అనిపించలేదు.ఇక సూర్యని ఏ రేంజ్ లో ఆదరిస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్గా కంగువ సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలామంది సూర్యకి ఆదరణ చూపించారు దీనిని చూసి సూర్య ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ప్రమోషనల్ మూమెంట్ కంటే ఎమోషనల్ మూమెంట్ అని చాలామంది కనిపించింది.
స్నేహితుడు సినిమా తర్వాత విజయ్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకి ప్రమోషన్ కి కూడా హైదరాబాద్ కు వచ్చాడు విజయ్. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ కి కూడా మంచి మార్కెట్ ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమాను కూడా చేశాడు విజయ్. అయితే విజయ్ తన మార్కెట్ ను తెలుగులో సరిగ్గా వాడుకోవట్లేదు అని అందరికీ తెలిసిందే. విజయ్ నటించిన ఏ సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్న కూడా తెలుగు ప్రమోషన్స్ కి హాజరు కాడు విజయ్.
ఇక రీసెంట్ గా తలపతి విజయ్ ఒక రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ పేరు తమిళ వెట్రి కళగం. ఈ పార్టీకి సంబంధించిన జెండాను కూడా కొద్దిరోజుల క్రితం ఆవిష్కరించాడు విజయ్. అయితే దీనిలో విజయ్ మాట్లాడుతూ గెలిచినా ఓడిన ఒంటరిగానే ప్రయాణిస్తాను. నా ఫ్యాన్స్ తో ఇంకో పార్టీ జెండాను మోయనవ్వను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ కామెంట్స్ విజయ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేశాడా అంటూ కొంతమంది సందేహం వ్యక్తం వ్యక్తం చేశారు అప్పట్లో కొంతమంది.
నేడు విజయ్ పార్టీ టీవీకే మహానాడు జరగనుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి టీవీ కే మహానాడు ను నిర్వహించనున్నారు. టీవీకే మొదటి మహానాడు కావడంతో విళుపురం జిల్లా విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు 3 కిలోమీటర్ల మేర జెండాలు, విద్యుత్ దీపాలంకరణ చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు హీరో విజయ్. చాలామంది సినిమాల్లో తమ ప్రతిభను చూపించి రాజకీయాల్లో కూడా తమదైన ముద్రణ వేసిన వాళ్ళు ఉన్నారు. ఇక విజయ్ ఏ స్థాయిలో తమిళ రాజకీయాల్లో ప్రభావాన్ని చూపించి ప్రజాసేవ అందిస్తాడో వేచి చూడాలి. వాటికంటే ముందు ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో అని అందరికీ ఆసక్తి మొదలైంది.