Suriya: చాలామంది హీరోలకి విపరీతమైన అభిమానులు ఉన్నట్లే నెగిటివ్ ఫ్యాన్స్ కూడా ఉండటం సహజం. అయితే అతి తక్కువ మంది హీరోలను మాత్రమే నెగిటివ్ ఫ్యాన్స్ కూడా లేకుండా చాలామంది ఇష్టపడతారు. అలాంటి హీరోల ప్రస్తావన వస్తే సూర్యకి ప్రథమ స్థానం ఇవ్వచ్చు. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సూర్యకి ఉంది. వాస్తవానికి తమిళ్లో కంటే కూడా తెలుగులో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పిన కూడా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. లేకపోతే సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చాయి. అన్ని సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించి సూర్యను సొంతవాన్ని చేసుకున్నారు. రీసెంట్ గా కంగువ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాదులో సూర్య కూడా విపరీతమైన ప్రేమను చూపించారు. ఈ ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా ఎమోషనల్ గా జరిగాయి.
శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా కంగువ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తెలుగులో బాహుబలి సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించిందో ఆ స్థాయిలో ఈ సినిమా ఉండబోతుంది అని తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు. అలానే ఈ సినిమా దాదాపు 2000 కోట్ల వరకు వసూలు చేస్తుంది అని నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమా ఉండబోతుందని ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. లేకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఆడియో లాంచ్ వేడుక నిన్ను చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ నేను కాలేజీలో బాస్ అని పిలిచేవాడిని, నా సీనియర్ ఇప్పటికీ కూడా నేను అలానే పిలుస్తుంటాను. నాతో రెండు సినిమాలు చేశారు. ఉదయానికి స్టాలిన్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు అంటూ గుర్తు చేసుకున్నారు. అలానే నా ఇంకో స్నేహితుడు తను కూడా రాజకీయాల్లో ఉన్నాడు అంటూ విజయ గురించి కూడా చెప్పుకొచ్చాడు సూర్య ఈ మాటలు సూర్య ఫ్యాన్స్ తో పాటు మిగతా అభిమానులు కూడా విపరీతంగా నచ్చాయి. అందుకే సూర్యను అందరూ ఇష్టపడతారు అని చెప్పొచ్చు.
కంగువ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ అన్నీ కూడా సినిమా మీద విపరీతమైన అంచనాలను పెంచాయి. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవి మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దేవి ఆరా అయిపోయింది అనుకునే టైంలో పుష్ప సినిమాతో గ్రేట్ కం బ్యాక్ ఇచ్చాడు. పాన్ ఇండియా లెవెల్లో పేరు సాధించాడు. లేకపోతే కంగువ సినిమా అని మొదటి అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమాను నవంబర్ కి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఏదేమైనా సినిమా మీద మాత్రం మంచి నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్.