Divorcee Woman LiveIn| జీవితంలో ప్రతి వ్యక్తి తనకు ఉన్నదాంట్లో సంతృప్తికరంగా ఉంటే జీవన ప్రయాణం సంతోషకరంగా సాగుతుంది. కానీ చాలా మంది తమకు ఎంత లభించినా సంతృప్తి చెందరు. అలాంటి వారి జీవితం దుఖంతోనే ముగుస్తుంది. తాజాగా అలాంటిదే ఒక ఉదాహరణ ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అక్కడ ఒక మహిళ ఒక భర్తతో సంతృప్తికరంగా జీవించలేక మరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అతడిని కూడా వదిలేసి తన అక్క భర్తతో సహజీవనం చేసింది. కానీ ఇటీవల ఆమె అనుమాస్పద స్థితిలో మరణించింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గాజియాబాద్ జిల్లా మోదీనగర్ పట్టణం జగత్ పురి కాలనీలో నివసించే రాఖీ సింగ్ అనే 27 ఏళ్ల యువతి నాలుగేళ్ల క్రితం జగత్ నారాయణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ జగత్ నారాయణ్ కు సరైన సంపాదన లేని కారణంగా ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరిగేవి. రాఖీ తన భర్త సంపాదనతో సంతృప్తి చెందక అతడిని వదిలేసి తన పుట్టింటికి వచ్చేసింది. సంవత్సరంలోగా అతడితో ఉండేది లేదని పెద్దల మధ్య అంగీకారంతో విడాకులు తీసుకుంది.
Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?
ఆ తరువాత భూషణ్ సింగ్ అనే వ్యక్తితో రెండో వివాహం చేసుకుంది. అయితే కొంతకాలం తరువాత తన పెదనాన్న కూతురు సంజన దేవి, ఆమె భర్త కిషన్ రాజ్ అమెరికా నుంచి వచ్చారు. అప్పుడు కిషన్ సింగ్ కోటీశ్వరుడు కావడంతో రాఖీ అతనితో ఎక్కువ సమయం గడిపేది. ఇదంతా ఆమె రెండో భర్త భూషణ్ సింగ్ కి నచ్చేది కాదు. దీంతో ఇద్దరూ గొడవపడేవారు. మరోవైపు రాఖీ, ఆమె బావ కిషన్ రాజ్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చివరికి రాఖీ తన రెండో భర్తను వదిలేసి తన బావ కిషన్ రాజ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉండేందుకు వెళ్లిపోయింది.
రాఖీ, ఆమె రెండో భర్త ఇద్దరూ విడాకుల కోసం కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 20, 2024న కిషన్ రాజ్ తో సహజీవనం చేస్తున్న రాఖీని కలిసేందకు ఆమె తమ్ముడు అమిత్ సింగ్ వెళ్లాడు. కానీ ఇంట్లో రాఖీ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఇది చూసి అమిత్ కంగారు పడి ఆమెను లేపడానికి ప్రయత్నించగా.. ఆమె చనిపోయిందని తెలిసింది. దీంతో అమిత్ పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రాఖీ సింగ్ శవాన్ని పరిశీలించారు. రాఖీ మెడ, చేతులపై గాయాలున్నాయి. ఎవరో ఆమె చేతులు కట్టేసి తాడు లాంటి వస్తువుతో ఆమె గొంతు నులిమి హత్య చేశారు.
Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?
రాఖీ సింగ్ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించారు. రాఖీ సింగ్ ని ఎవరో హత్య చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె అక్క, లేదా బావ కిషన్ రాజ్ ఈ హత్య చేసి ఉంటారని విచారణ జరుగుతోంది. కానీ కిషన్ రాజ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని తెలిసింది. ప్రస్తుతం పోలీసులు రాఖీ సింగ్ హత్య కేసులో ఆమె ఇద్దరు భర్తలపై కూడా అనుమానిస్తున్నారు.