OTT Movie : బో*ల్డ్ సినిమాలకు ఆదరణ రోజు రోజుకు మరింతగా పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగానే ఓటీటీ లు కూడా రొమాంటిక్ అని పేరుతో ఒక సపరేట్ కేటగిరీని పెట్టి మూవీ లవర్స్ కి ఇలాంటి కంటెంట్ ని సజెస్ట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోపోయే మూవీ కూడా బోల్డ్ మూవీ లవర్స్ కోసమే. ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చు? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా పక్క బోల్డ్ కంటెంట్ తో ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో క్రైమ్ థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. ఈ మూవీ ప్రస్తుతం దిగ్గజ ఓటిటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా పేరు “బ్రజేన్” (Brazen). 2022లో రిలీజ్ అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఓటీటీ లో కూడా భారీ వ్యూస్ తో దూసుకెళ్తోంది.
కథలోకి వెళ్తే…
సినిమాలో హీరోయిన్ పేరు గ్రేస్. ఆమె ఒక మిస్టరీ నవల రచయిత. ఇక ఈ రచయితకుండే ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ అమ్మడు తన పిల్లల కస్టడీ విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక గ్రేస్ కి సోదరి క్యాథలిన్ కూడా ఉంటుంది. అయితే ఆమె భర్త చాలా రిచ్ కావడంతో పాటు ఆమెకు విడాకులు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. ఈ నేపథ్యంలోనే గ్రేస్ తన సోదరి దగ్గర నివసించడానికి వెళ్తుంది. ఆ తర్వాత టీచర్ గా ఒక సాదాసీదా జీవితాన్ని గడుపుతుంది. డే అంతా టీచర్ గా పని చేసే ఈ బ్యూటీ రాత్రి అయితే చాలు కాకరేపే పర్ఫామెన్స్ తో రొమాన్స్ పాటలు నేర్పిస్తూ ఉంటుంది. వెబ్ క్యాంప్ లో ఆమె చేసే బో*ల్డ్ పర్ఫామెన్స్ ఎంతోమందిని ఆకర్షిస్తుంది. టీచర్ ఇలా చేస్తుందనే విషయం స్కూల్లో ఎవరికి తెలియదు. చాలా జాగ్రత్తపడుతూ ఉంటుంది. కానీ ఒకరోజు తన స్టూడెంట్ కి అసలు విషయం తెలుస్తుంది. మరి ఆ స్టూడెంట్ టీచర్ గురించి తెలుసుకొని ఎలా రియాక్ట్ అయ్యాడు? హీరోయిన్ సోదరి ఏమైంది? అసలు హీరోయిన్ ఒకవైపు టీచర్ గా మరోవైపు వెబ్ క్యాంప్ పెర్ఫార్మర్ గా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆమెను చంపాలనుకున్నది ఎవరు? తనను ఒక డిటెక్టివ్ హెచ్చరించినప్పటికీ అతని మాటలను బేకాతరు చేసి ఈ హీరోయిన్ కేసులో ఎలా చిక్కుకుంది? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ రొమాంటిక్ మిస్టరీ మూవీ”బ్రజేన్” (Brazen) ని తెరపై చూడాల్సిందే. ఈ సినిమాలో బో*ల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయి కాబట్టి బి కేర్ఫుల్. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడండి. బోల్డ్, థ్రిల్లర్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఉటుంది. మరెందుకు ఆలశ్యం ఈ మూవీ పై ఓ లుక్ వేయండి.