EPAPER

OTT Movie : శోభనం రోజే భార్య ట్రాన్స్ జెండర్ అని తెలిస్తే…

OTT Movie : శోభనం రోజే భార్య ట్రాన్స్ జెండర్ అని తెలిస్తే…

OTT Movie : శోభనం అనేది ప్రతి ఒక్కరికి తమ జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం అవుతుంది. కానీ ఆరోజు కళ్ళ ముందు ఉంది అసలు అమ్మాయి కాదని ఆ భర్తకు తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉంది కదా?.. కానీ ఈ సినిమాని చూస్తే గుండె బరువు ఎక్కడం ఖాయం. ఇంట్రెస్టింగ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ మూవీ ఏ ఓటీటీ లో అందుబాటులో ఉంది? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.


జియో సినిమాలో అందుబాటులో…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ప్రస్తుతం జియో సినిమా (Jio Cinema) అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురిపించింది. హిజ్రాలకు జరిగే ఘోర అవమానాలు, బాధలు, ఇండియాలో వాళ్ళు ఎదుర్కొనే కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఈ మూవీ ఖచ్చితంగా మస్ట్ వాచ్ సినిమాల లిస్టులో ఉండాల్సిందే. సినిమా పేరు “అన్ ఉమన్” (UnWoman). సినిమాను చూస్తున్నంత సేపు మనలో ఆలోచనలను రేకెత్తిస్తుంది. సమాజంలో హిజ్రాల పట్ల జరుగుతున్న అకృత్యాలు కలల ముందు కదులుతున్నప్పుడు ఓ రేంజ్ లో కోపం కూడా వస్తుంది. సినిమాను చూశాక ట్రాన్స్ జెండర్ల కష్టాలు మనసును బరువెక్కిస్తాయి. ఒక మంచి ఫీల్ గుడ్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా ఇది.


కథలోకి వెళ్తే…

సినిమా మొదట్లోనే ఒక అబ్బాయి ఓ అమ్మాయిని ఘోరంగా కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆమెకి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. పెళ్లి సంబంధం అనడం కంటే ఆమెను వేరే వాళ్లకు అతను అమ్మేస్తాడు. ఆ ఊర్లో ఆచారం ప్రకారం అమ్మాయిలు పుడితే చంపేస్తారు. లేదా అమ్మేస్తారు. ఇలాంటి ఊర్లో ఒక అతని అండర్లో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అమ్మాయి. నిజానికి తను అమ్మాయి కాదు ఒక హిజ్రా. కానీ అమ్మాయి పేరుతోనే ఆమె ను వేరే వాళ్లకు అమ్మేస్తారు. ఇక ఆ కొనుక్కున్న వాడు కూడా ఆ అమ్మాయి అనుకొని ఆమెను డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోతాడు. అంతా ఇష్టం లేకపోయినా ఆమె చేసేదాని లేక అతనితో వెళ్తుంది. తీరా ఇక్కడికి వెళ్లాక అతనికి తను ట్రాన్స్ జెండర్ అని ఎలా తెలిసింది? ఈ ట్రాన్స్ జెండర్ పరిస్థితి ఏమైంది? అసలు ఆమె తనను అమ్మేసిన వ్యక్తి చేతికి ఎలా చిక్కింది? చివరికి సినిమాలో వచ్చే ట్విస్ట్ ఏంటి? విషయాలు తెలియాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడండి. ముఖ్యంగా ఈ సినిమాలో మనం సొసైటీలో రావాల్సిన ముఖ్యమైన చేంజి గురించి డైరెక్టర్ డిస్కస్ చేశాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా లేదా ట్రాన్స్ జెండర్ అయినా అందరూ మనుషులమే అనే విషయాన్ని గుర్తు చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ వీకెండ్ ఈ సినిమాపై ఒక లుక్కెయ్యండి.

Related News

OTT Movie : భర్త కోసం సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తే పక్కింటోడి పాలు… ఈ బోల్డ్ మూవీకి బుర్ర కరాబ్

OTT Movie : ఎడారిలో ఒంటరి మహిళ… తప్పిపోయి వచ్చిన అబ్బాయితో వదలకుండా ఆ పని

OTT Movie : పిల్లల్ని చదివించే నెపంతో హాస్టల్లో అలాంటి పనులు… హాస్టల్స్ ఇలా కూడా ఉంటాయా?

OTT Movie : బాయ్ ఫ్రెండ్ బట్టలు విప్పి నిజం చెప్పమనే అమ్మాయి… క్రేజీ బోల్డ్ మూవీ

OTT Movie : భార్య గదిలోకి పని వాడిని పంపే జమిందార్… ఈ బోల్డ్ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని శవంతో ఆ పని… ఈ మూర్ఖుడు చేసే పని చూస్తే మైండ్ బ్లాక్

OTT Romantic Thriller : కోరుకున్న వ్యక్తితో శృ*** కోసం తెగించేసిన ప్రేయసి.. భార్యతో ఆ పని..

×