OTT Movie : ఇప్పుడు ఓటీటీలో వెబ్ సీరీస్ హవా నడుస్తోంది. బో*ల్డ్ సినిమా అంటే పిచ్చెక్కిపోయే మూవీ లవర్స్ కోసమే ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సీరీస్. మరి ఈ వెబ్ సీరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే…
చోర్కి (Chorki) ఓటిటిలో
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఒక బెంగాలీ బో*ల్డ్ వెబ్ సిరీస్ గురించి. ఇందులో బో*ల్డ్ అంశాలు మాత్రమే కాకుండా కావలసినవి క్రైమ్ థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ మూవీ ప్రస్తుతం చోర్కి (Chorki) అనే ఓటిటిలో అందుబాటులో ఉంది. ఈ వెబ్ సీరీస్ పేరు “మై సెల్ఫ్ అలెన్ స్వపన్” (My Self Allen Swapan).
కథలోకి వెళ్తే…
సినిమా 2018లో నడుస్తుంది. కాక్స్ బజార్లో మత్తు పదార్థాల బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతూ ఉంటుంది. అయితే జనాల్ని వీటి బారిన పడకుండా ఆపడానికి ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెడుతుంది. అంతేకాకుండా పనిలో పనిగా కొంతమంది మత్తు పదార్థాలు అమ్మే గ్యాంగ్స్టర్స్ ని మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్ లార్డ్ అలెన్ స్వాపొన్ పోలీసుల కాల్పుల్లో మరణించినట్టుగా వార్తలు వస్తాయి. అయితే అలెన్ కి అచ్చం తనలాంటి సోదరుడే ఒకడుఉంటాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన కాల్పుల నుంచి తప్పించుకొని తన తమ్ముడి ఇంటికి భయపడుతూ వస్తాడు అలెన్. అక్కడైతే తను అచ్చం తన తమ్ముడిలాగే ఉన్నాను కాబట్టి ఎవరూ గుర్తుపట్టరని, సేఫ్ గా ఉండవచ్చని భావిస్తాడు.
అనుకున్నట్టుగానే అంతగా భయపడినప్పటికీ తన తమ్ముడి భార్య కూడా అలెన్ ని గుర్తుపట్టదు. దీంతో మొత్తానికి తన తమ్ముడిగా మారి అతని భార్యతో సంసారం మొదలుపెడతాడు. కానీ ఒక టైం లో తమ్ముడి భార్యకి తనపై అనుమానం వస్తుంది. ఇంకో వైపు అలెన్ దగ్గర పనిచేసే ఓ వ్యక్తి ఇతడిని చూస్తాడు. అతడికి అనుమానం వచ్చినా ఎవరికీ చెప్పడు. ఇంకోవైపు పోలీసుల వేట కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆలెన్ బ్రతికి ఉన్నాడా అని అనుమానాలు మొదలవుతాయి. మరి చివరికి ఈ డ్రగ్ లార్డ్ తన తమ్ముడి భార్యకి అసలు నిజం చెప్పాడా? ఆమె ఎలా రియాక్ట్ అయింది? పోలీసులు ఈ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను పట్టుకోగలిగారా? అసలు ఆలెన్ తన తమ్ముడిని ఏం చేశాడు? చివరకు ఈ సిరీస్ స్టోరీ ఎలా ముగిసింది? అనే విషయాలు తెలియాలంటే “మై సెల్ఫ్ అలెన్ స్వాపోన్” (My Self Allen Swapan) అనే ఈ సినిమాపై ఒక లుక్ వెయ్యండి. ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ మంచి త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అలాగే సినిమాలో కావలసినంత మసాలా కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా ఈ వెబ్ సిరీస్ ని చూడకపోతే ఈ వీకెండ్ తప్పకుండా ఒకసారి చూసేయండి. ఈ వెబ్ సిరీస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.