EPAPER

CM DIARY: సీఎం డైరీ.. ఈ వారం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలు.. ఏ రోజు ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే?

CM DIARY: సీఎం డైరీ.. ఈ వారం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాలు.. ఏ రోజు ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే?

ఈవారం సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా గడిచింది. ISB లీడర్ షిప్ సమ్మిట్ తో మొదలై.. క్యాబినెట్ మీటింగ్ దాకా వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు హైదరాబాద్ మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. పోలీస్ స్కూల్ లో చదువుకున్నామని గొప్పగా చెప్పుకునేలా ఉంటుందని భరోసా ఇచ్చారు.


20-10-2024: ఈ నెల 20న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నాయకత్వ సదస్సుకు సీఎం హాజరయ్యారు. త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంచి లీడర్ అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలన్నారు. ఐఎస్బీలోని విద్యార్థులు నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకునేందుకు ఏడాదికోసారి ప్రముఖులు, వక్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై, విద్యార్థులకు సూచనలు చేశారు. ప్రజలతో మమేకమైతే ఏదైనా సాధించవచ్చన్నారు. జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని అన్నారు. నాయకులు డబ్బు, వ్యక్తిగత జీవితం, సమయం ఇలా చాలానే త్యాగాలు చేయాల్సి వస్తుందన్నారు.

⦿ ఐఎస్బీలో ఉన్నవారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని CM చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని 600 బిలియన్ సిటీగా మార్చేందుకు అందరి సహకారం కావాలన్నారు. ఎంత గొప్ప నాయకుడికైనా ధైర్యం ముఖ్యమని, తెలివి తేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేసే తత్వంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా కలసి రావాలన్నారు. గొప్ప పనులు చేయడానికి రిస్క్‌ తీసుకోవాలన్నారు. అటు తెలంగాణలో పోలీసు, పైర్, ఎస్పీఎఫ్, జైళ్ల శాఖల ఉద్యోగుల పిల్లల భవిష్యత్ కోసం కొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. హైదరాబాద్ మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో 50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి సీఎం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.


⦿ పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంలో చెప్పినట్టుగానే పోలీసు కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే భూమి పూజ జరగడం చకచకా పూర్తయ్యాయి. స్కూల్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. సైనిక్ స్కూల్ తరహాలో దేశంలోనే మొట్టమొదటిదిగా పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేకంగా స్కూల్ కీలక నిర్ణయంగా నిలిచిపోయింది. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో హోంగార్డు నుంచి డీజీపీ వరకు వారి కుటుంబాల పిల్లలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు.

21-10-2024: రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా శాంతిభద్రతలు కీలకమని పోలీస్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం అన్నారు. శాంతియుత వాతావరణాన్ని కలుషితం చేసేలా ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేవారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇటీవల కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కేవలం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు మాత్రమేనని, నేరగాళ్ల విషయంలో కఠిన వైఖరితో ఉండాలన్నారు.

23-10-2024: ఈనెల 23న వయనాడ్‌ లోక్‌సభ బైపోల్ లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రియాంకాగాంధీ నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌ స్వాగతం పలికారు. తాజా రాజకీయ పరిణామాలపై రాహుల్‌గాంధీ కాసేపు మాట్లాడారు సీఎం. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ అయ్యారు. వయనాడ్ వెళ్లే సమయంలో మైసూర్ విమానాశ్రయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలవడంతో ఆయనతో సీఎం రేవంత్ తాజా రాజకీయాలపై చర్చించారు.

24-10-2024: ఈనెల 24న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి, ప్రభుత్వ సలహాదారు కేకే పాల్గొన్నారు. ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో కేకే ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీపావళి తర్వాత శాఖల వారిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ కేబినేట్ సబ్ కమిటీ సమావేశమవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని విషయాలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వస్తున్నామని సీఎం అన్నారు. బదిలీలు, ఉద్యోగుల సర్వీసు అంశాలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. జీవో 317లోపాలను సవరించాలని ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వానికి జోనల్ వ్యవస్థపై అవగాహన లేకుండా పోయిందన్నారు ఉద్యోగులు.

25-10-2024: స్పోర్ట్స్ పై మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సీఎం రేవంత్.. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. యువత వ్యసనాలకు బానిస కాకుండా స్పోర్ట్స్ వైపు మళ్లించేందుకు చాలా దూరదృష్టితో పకడ్బందీ ఆలోచనలతో సీఎం ఉన్నారు. స్పోర్ట్స్ అంటే కేవలం ఆటవిడుపు అన్నట్లు కాకుండా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన యువత సత్తా చాటేలా స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలని ఈనెల 25న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు సాధ్యమైనంత త్వర‌గా రూపొందించాలని చెప్పారు. మరో పది రోజుల్లోగా యంగ్ ఇండియా స్పోర్ట్ వర్సిటీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని సీఎం సూచించారు.

⦿ తెలంగాణ స్పోర్ట్స్ పాల‌‌‌‌సీలో యంగ్ ఇండియా ఫిజిక‌‌‌‌ల్ ఎడ్యుకేష‌‌‌‌న్ అండ్ స్పోర్ట్స్ యూనివ‌‌‌‌ర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడ‌‌‌‌మీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ భాగంగా ఉన్నాయి. వీటిలో చేయాల్సిన మార్పులు చేర్పులపై సీఎం దిశానిర్దేశం చేశారు. అంతే కాదు.. అత్యుత్తమ క్రీడా విధానం కోసం సౌత్ కొరియా స్పోర్ట్స్ వర్సిటీ, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ వ‌ర్సిటీ అనుస‌రిస్తున్న విధానాల‌ను స్టడీ చేయాల‌ని, ఈ రంగంలో నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు జరపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర, జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడా పోటీల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్‌ను వెంట‌నే త‌యారు చేయాలన్నారు. వ‌చ్చే రెండేళ్లలో నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌ను సంప్రదించాల‌న్నారు. ఇప్పటికే ఉన్న స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌‌‌ల‌‌‌‌ను ఆధునిక అవ‌‌‌‌స‌‌‌‌రాల‌‌‌‌కు తగ్గట్టుగా అప్‌‌‌‌గ్రేడ్ చేయడంపైనా ఫోకస్ పెట్టారు. స్పోర్ట్స్ వర్శిటీ వచ్చాక కచ్చితంగా పిల్లలకు మెడల్స్ వచ్చేలా చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు.

⦿ ఎన్డీయే సర్కార్ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణా రాష్ట్రాల పన్నులను నార్త్ కు దోచిపెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌ లో సీఎం పాల్గొని ఈ కామెంట్స్ చేశారు. కేంద్రానికి తెలంగాణ నుంచి రూపాయి పంపిస్తే కేంద్రం తిరిగి రాష్ట్రానికి 40 పైసలు మాత్రమే వస్తున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి హైలెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

⦿ గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడని గుర్తు చేసుకున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశించారు.

⦿ ఈనెల 26న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

Also Read: కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్.. సుదీర్ఘంగా సాగిన సమావేశం.. ఆ రెండు జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

Related News

Dharmana Prasada Rao: జగన్‌కు బిగ్ షాక్.. ధర్మాన చూపు.. జనసేన వైపు

Puvvada Ajay Kumar: తుమ్మల దెబ్బ.. ఖమ్మం నుండి పువ్వాడ జంప్

Vizag Steel Plant Issue: కూటమి నేతలకు విశాఖ టెన్షన్

Baba Vanga Future Predictions: రెండు నెలల్లో యుగాంతం? ఇవిగో ఆధారాలు..

Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడ? అప్పుడు అరాచకం.. ఇప్పుడు అజ్ఞాతం, అవన్నీ బయటపడతాయనేనా?

Bharat Jagruthi: ‘జాగృతి’ జాడేది? ఆ డబ్బులన్నీ ఏమయ్యాయ్?

Vijay Political Party: తమిళ రాజకీయాల్లో రజినీ, కమల్ అలా.. మరి విజయ్? ఆ స్పేస్‌ను TVK భర్తీ చేయగలదా?

×