OTT Movie : బర్త్ డే వచ్చిందంటే ఆ పాపకు చావే హాలీవుడ్ హారర్ సినిమాలు అంటే ఎంత భయం వేసినా సరే చూడడానికి ఆసక్తిని కనబరుస్తారు హర్రర్ మూవీ లవర్స్. ముఖ్యంగా ఇంగ్లీష్ సినిమాల్లో వైలెన్స్ విషయంలో పెద్దగా హద్దులు ఉండవు. కాబట్టి ఇలా ఈ రెండు అంశాల కాంబినేషన్లో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటి హర్రర్ మూవీనే. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
రెండు ఓటిటిలో స్ట్రీమింగ్..
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా ప్రస్తుతం రెండు ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకటి ఇండియాలో అందరికీ అవైలబుల్ గా ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazan prime video). ఇక మరొక ఆప్షన్ ఆపిల్ టీవీ. ఎవరికి ఏ ఓటీటీలో సబ్ స్క్రిప్షన్ ఉంటే ఆ ఓటిటిలో ఈ హర్రర్ మూవీ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు.
కథలోకి వెళ్తే…
1970లో మూవీ మొదలవుతుంది. ఒరేగాన్ అనే ప్రాంతంలో ఏదో శబ్దం రావడంతో చిన్న పాప కెమెరాను పట్టుకుని అక్కడికి వెళుతుంది. అక్కడ ఓ వింత వ్యక్తి తను లాంగ్ లెగ్స్ ధరించాలని చెబుతూ భయపెట్టే విధంగా పాప దగ్గరికి వెళ్తాడు. ఆరోజు ఆ పాప పుట్టినరోజు… కట్ చేస్తే 1990లో స్టోరీ నడుస్తుంది. లీ హార్కర్ అనే హీరోయిన్ గా పనిచేస్తుంది. దేవుడు దిగివచ్చినా పరిష్కరించలేని కేసును హీరోయిన్ ఒక చిన్న క్లూ తో పరిష్కరిస్తుంది. దీంతో ఆమెకు 20 ఏళ్ల క్రితం పరిష్కారం కాని కొన్ని మర్డర్ కేసులను ఇన్వెస్ట్ గేట్ చేయమని ఆదేశిస్తారు. అందులో భాగంగానే 20 ఏళ్ల క్రితం ఒరే గాండ్ లో కొన్ని ఫ్యామిలీలు వింతగా చనిపోతాయి. విషయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీ లోనూ తమ కుటుంబ సభ్యులందరినీ ఆ ఫ్యామిలీలోని ఎవరో ఒకరు చంపేసి చివరగా వాళ్ళు చనిపోతారు. దాదాపు ఇలా పది కుటుంబాలకు జరగగా, అన్ని క్రైమ్ సీన్స్ లోనూ ఓ లెటర్ దొరుకుతుంది. ఇక ఆ లెటర్స్ లో లాంగ్ లెగ్స్ అని అర్థం ఉండే వింత పదాలు ఉంటాయి.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రతి మర్డర్ లో చనిపోయిన అమ్మాయి వయసు 9 ఏళ్ళు, అలాగే బర్త్ డే డేట్ 14. ఈ కామన్ పాయింట్ ను పట్టుకున్న హీరోయిన్ ఆ మర్డరర్ ఎవరో కనిపెట్టిందా? వరుసగా జరిగిన ఈ వింత మరణాలకు కారణం ఏంటి? అసలు అతను ఎవరికీ కనిపించకుండా ఇలాంటి హత్యలు ఎందుకు చేస్తున్నాడు? హీరోయిన్ లీ తల్లికి ఇందులో సంబంధం ఉందా? అసలు హీరోయిన్ కి ఈ కేసుకి మధ్య ఉన్న లింక్ ఏంటి? లాంగ్ లెగ్స్ తాను చేసే ప్రతి హత్య వెనుక లీతల్లి హస్తం ఉందని ఎందుకు చెప్తాడు? అనే విషయం తెలియాలంటే ఈ “లాంగ్ లెగ్స్” ( Long legs) అనే సినిమాను చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ కథకు మూఢనమ్మకాన్ని సైతాన్ అనే అంశాన్ని యాడ్ చేసి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ మూవీ ఓటిటిలో కూడా అదరగొట్టింది.