OTT Movie : రీసెంట్ గా విజయ్ సేతుపతి కెరీర్లో 50 సినిమాగా వచ్చిన మహారాజ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా అచ్చం ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ క్రైంథ్రిల్లర్ మూవీనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీడీలో అందుబాటులో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్…
క్రాంతి విల్లర్ సినిమాలకు ఎలాంటి ఆధారం దక్కుతోందో చెప్పడానికి దృశ్యం మహారాజా వంటి సినిమాలే నిదర్శనం. ఇక అచ్చం ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ తో రూపొందే సినిమాలు ఇటీవల కాలంలో ఓటిటి మూవీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. కూతురు న్యూడ్ వీడియో లీక్ అయిందని పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా పేరు “భారత సర్కస్” (bhrata circus). 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో (Prime video) స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సింప్లీస్ అవుట్ అని మరో ఓటిటి లో కూడా అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
మహారాజ సినిమాలో కూతురుపై అగాయిత్యం చేసిన వారి గురించి పగ తీర్చుకునే కథ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ భారత సర్కస్ సినిమా మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రికి చేరుకోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ముఖం ఎరగని ఆ తండ్రి కూతురు కోసం పోలీస్ స్టేషన్ కి వెళతాడు. కానీ అప్పుడే పోలీస్ స్టేషన్లో పోలీసులంతా డెకరేషన్ చేస్తూ బిజీగా ఉంటారు. ఇక అతను ఎస్ఐ ని కలవాలనిపోతే అంతలోనే పై అధికారితో అతను మీటింగ్ కి వెళ్ళిపోతాడు. అయితే కేరళలో మావోయిస్టుల కలకలం రేగుతోందంటూ ఓ ఇంపార్టెంట్ పని మీద అతన్ని బయటకు పంపిస్తారు. అంతలోపు సిఐ అతడిని పిలిపించి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ తండ్రి అసలు విషయాన్నీ చెప్పడానికి సంకోచిస్తాడు. చివరికి ఎస్ఐ ఎప్పటికో తిరిగి వస్తాడు. అతను ఇంకా అక్కడే ఉండడంతో పిలిచి మాట్లాడుతాడు. అందరు ముందు విషయం చెప్పకుండా సీక్రెట్ గా రూమ్ లో చెప్తానని చెప్పి తన కూతురు న్యూడ్ వీడియో బయటకు వచ్చిందని, దానివల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ వాపోతాడు. కానీ నిజానికి ఫోన్ చెక్ చేసినా ఎస్ఐకి అందులో అసలు ఏమీ కనిపించదు. అయినప్పటికీ ఇన్వెస్టిగేట్ చేస్తానంటూ పంపించేస్తాడు.
ఇక ఇంటికి వెళ్ళాక విదేశాల్లో ఉంటున్న తన కూతురికి వీడియో కాల్ చేసి సేఫ్ గా ఉందా లేదా అని కనుక్కొని అప్పుడు ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఎలాగైనా సరే తాను కూడా ఒక ఆడ కూతురుకి తండ్రి కాబట్టి ఆ తండ్రికి న్యాయం చేయాలని డిసైడ్ అవుతాడు. అంతలోనే టీవీలో మరో ఈస్ట్ సంఘటన రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తీరా అక్కడికి వెళ్ళాక హీరోయిన్ ఇంటి దగ్గర ఉండే ఓ అబ్బాయి ఆ రూమ్ లో ఉంటున్నట్టుగా సాక్షాలు దొరుకుతాయి. హీరోయిన్ తనని పిలిపిస్తే అతను తమకు తెలుసు అని చెప్తాడు. పైగా ఆ అబ్బాయి ఫోన్లో హీరోయిన్ నెంబర్ కూడా ఉంటుంది. మరి మావోయిస్టులకి అబ్బాయికి ఏంటి సంబంధం? ఆ అబ్బాయి వల్లే హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందా? చివరికి ఈ కేసును ఎస్ఐ ఎలా సాల్వ్ చేశాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఒక లుక్కెయ్యండి. క్లైమాక్స్ మాత్రం దిమ్మ తిరిగే రేంజ్ లో ఉంటుంది.