EPAPER

Cm Revanth Reddy : సీఎం రేవంత్ తో మేఘా ఎండీ కృష్ణారెడ్డి మీటింగ్

Cm Revanth Reddy : సీఎం రేవంత్ తో మేఘా ఎండీ కృష్ణారెడ్డి మీటింగ్

Cm Revanth Reddy :


⦿ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణంలో మేఘా సంస్థ భాగస్వామ్యం
⦿ సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి రూ.200 కోట్ల కేటాయింపు
⦿ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మేఘా ఎండీ కృష్ణారెడ్డి
⦿ భవన నిర్మాణాలకు కుదిరిన ఎంవోయూ

హైదరాబాద్, స్వేచ్ఛ: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేఘా సంస్థ ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది.


ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టేందుకు కంపెనీ ముందుకొచ్చింది. శనివారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ALSO READ : అమోయ్ కుమార్ మెడకు మరో ఉచ్చు.. రూ.20వేల కోట్ల భూ దోపిడీ.. ఈడీకి ఫిర్యాదు చేసిన భాదితులు

ప్రభుత్వం తలపెట్టిన స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు మేఘా కంపెనీ చర్చలు జరిపింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడుతామని ప్రకటించింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.

హైదరాబాద్ శివార్లలో కందుకూరు మండలంలో మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో రేవంత్ రెడ్డి ఆగస్ట్‌లో యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామని కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Related News

CM Revanth Reddy: చదువుల తల్లికి చేయూత.. గిరిజన యువతికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం

Ponnam Prabhakar on Diwali: జనావాస సముదాయల మధ్య బాణసంచా విక్రయాలపై.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

Raj pakala: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. మోకిలా పీఎస్‌కి రాజ్ పాకాల

Congress Leaders On KTR: జన్వాడ ఫామ్ హౌస్.. కాంగ్రెస్ నేతల డ్రగ్స్ టెస్ట్, సైలెంటయిన బీఆర్ఎస్

BRS Women Leaders: కేటీఆర్ నోరు మెదపరేం.. ఆ మహిళలకు న్యాయం జరిగేనా?

Formula E Racing Scam: హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ స్కామ్.. రంగంలోకి ఏసీబీ!

Rahul Gandhi Tour: నవంబర్ ఐదు.. తెలంగాణకు రాహుల్‌గాంధీ

×