EPAPER

Kaleshwaram Project: చివరి దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. నివేదికపై ఉత్కంఠ.. అవినీతి నిరూపితమైతే అరెస్టులు తప్పవా!

Kaleshwaram Project: చివరి దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. నివేదికపై ఉత్కంఠ.. అవినీతి నిరూపితమైతే అరెస్టులు తప్పవా!

పొలిటికల్ బాంబ్ 2


– చివరి దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ
– దీపావళికి పేలనున్న రెండో బాంబ్ ఇదేనా?
– కాళేశ్వరం మాటున భారీ అవినీతి
– అంచనాలు విపరీతంగా పెంచేసి దోపిడీ
– ఒక్క ప్రాజెక్టుతో వేల కోట్లకు పడగలెత్తిన మేఘా కృష్ణారెడ్డి
– అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఆడిందే ఆట
– కేసీఆర్ కనుసన్నల్లోనే అంతా జరిగిందంటున్న మాజీ ఈఎన్‌సీలు
– హరీష్ రావు చేతిలో కాళేశ్వరం కార్పొరేషన్
– ఘోష్ కమిషన్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ
– అవినీతి, నిర్లక్ష్యం బయటపడితే క్రిమినల్ కేసులే
– అదే జరిగితే అరెస్టులు పక్కా

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Kaleshwaram Project: ప్రభుత్వం చెబుతున్న పొలిటికల్ బాంబులు పేలేందుకు టైమ్ దగ్గరపడుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓవైపు కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండగా, కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా చివరి దశకు చేరుకుంది. పొలిటికల్ బాంబుల్లో ఇది రెండోదిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్, త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని సమాచారం. దాని ఆధారంగా కేసులు, అరెస్టులు జరిగే చాన్స్ ఉంది. విచారణలో మాజీ ఈఎన్‌సీలు, ఇంజినీర్లు చెబుతున్న దాన్నిబట్టి చూస్తే ప్రాజెక్టులో కుట్రపూరిత చర్యలు, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు, కాంట్రాక్టు సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు.


ఏ ఉద్దేశంతో కట్టారు.. ఏం చేశారు?
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను లక్ష కోట్లతో కట్టారు. ఇంకో పాతిక వేల కోట్లకు ప్లాన్ చేశారు. అప్పు చేసి మరీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్నారు గత సీఎం కేసీఆర్. ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే, ముందుచూపుతో ఏళ్ల తరబడి ఉండేలా కడతారు. లక్షల కోట్ల ప్రాజెక్ట్ అంటే, ఓ శతాబ్ద కాలం ఉపయోగపడాలి. ఎప్పుడంటే అప్పుడు కరువు తీరి కడుపు నింపాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అంతేనని ఎన్నో గొప్పలు చెప్పారు కేసీఆర్. కానీ, కొన్నేళ్లకే దీని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం 7 లింకులుగా, 28 ప్యాకేజీలుగా మార్చి దీని నిర్మాణం మొదలుపెట్టారు. గోదావరికి వంద మీటర్ల ఎత్తులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. కానీ, కొన్నేళ్లతో ఇందులోని లోపాలు బయటపడ్డాయి. చివరకు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయి, ప్రస్తుతానికి నీటి నిల్వ ఆగిపోయింది.

అంచనాలు పెంచేసి భారీ దోపిడీ
ప్రాజెక్టు పనుల్లో అధిక భాగం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ సంస్థ చేసింది. ఈపీసీ పద్దతిలోనే పనులు కొనసాగాయి. అయితే, ప్రాజెక్ట్ పనుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. కేంద్ర జ‌ల‌సంఘం డీపీఆర్‌లో ఆమోదించిన ఖ‌ర్చుకి అంచానాల‌కు తేడా అక్షరాలా రూ.67 వేల 406 కోట్లు. దీన్నిబట్టే అర్థం చేసుకోండి ఎంతగా దోపిడీ జరిగిందో. నిజానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ మొదలైంది. వ్యాప్కోస్ త‌యారు చేసిన‌ డీపీఆర్‌లో రూ.81,911 కోట్ల ఖ‌ర్చుతో పూర్తి అవుతుంద‌ని అంచ‌నా వేశారు. కానీ, లక్ష కోట్లకు పైనే ఖర్చు చేశారు. సివిల్ వ‌ర్క్స్‌లోనే రూ.43వేల కోట్లు పెంచారు. కాంట్రాక్ట్ కంపెనీలు ఎత్తిపోత‌ల కోసం మోటార్లను, పంపుల‌ను కొనుగోలు చేసిన స‌మ‌యంలో భారీగా అవినీతి జ‌రిగింది. త్వరితగ‌తిన పూర్తి చేసేందుకు భారీగా అంచ‌నాల‌ను పెంచుకుని టెండ‌ర్స్, నామినేష‌న్‌తో ద‌క్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ మేఘా 30శాతం క‌మీష‌న్స్‌తో స‌బ్ కాంట్రాక్టులు ఇచ్చింది. ఆ డ‌బ్బులు తిరిగి ప్రధాన కాంట్రాక్టర్ కు చేరేలా, జీఎస్టీలు ఎగ‌వేయ‌డం, ఇన్పుట్ స‌బ్సిడీ తెచ్చుకునేలా బినామీ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ సొమ్మును క్యాచ్ రూపంలో మార్చడం జరిగింది. ఇలా రూ.70వేల కోట్ల న‌గ‌దును మార్చి రూ.12వేల కోట్ల జీఎస్టీ ఎగ‌వేశార‌ని 2021లో జీఎస్టీ హైద‌రాబాద్ బ్రాంచ్‌లో రిపోర్టు ఉంది. ఈ రిపోర్టు దాచిపెట్టేందుకు, తారుమారు చేసేందుకు లంచాలు ఇచ్చార‌ని అనుమ‌నాలు ఉన్నాయి.

అధికారులదీ కీలక పాత్ర
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఆనాటి ఈఎన్సీల పాత్ర చాలా మోస‌పూరితంగా కనిపిస్తుంది. ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌గా ఉంటూ మేఘా సంస్థ నుంచి డ‌బ్బులు తీసుకుని కాంట్రాక్టర్స్ కి మేలు చేశారు. దానికి ప్రతిఫలంగా వంద‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తులు పెంచుకున్నారు. కొందరు రిటైర్డ్ అధికారులను తమ సంస్థలో చేర్చుకుని, లాబీయింగ్‌లకు కూడా పాల్పడింది మేఘా సంస్థ. అధికారులను ఇష్టం వచ్చినట్టు వాడుకుంది. అప్పటి ప్రభుత్వ అండదండలతోనే ఇదంతా సాగిందనే అనుమానాలున్నాయి. మేఘా సంస్థ భారీగా అవినీతికి పాల్పడి, గులాబీ నేతలకు కమీషన్లు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read: Indiramma Housing Scheme: వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. అధికారులతో మంత్రి సమీక్ష.. అదొక్కటే తరువాయి!

కమిషన్ నివేదిక తర్వాత ఏం జరగబోతోంది?
వేల కోట్లతో కట్టిన మేడిగడ్డ కుప్పకూలింది. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచే పరిస్థితి లేదు. ఇతర బ్యారేజీల్లోనూ లోపాలు బటయపడ్డాయి. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు, అంచనాలు పెంచడం వెనుక జరిగిన వ్యవహారాలను బయట పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులను ఈ కమిషన్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా కీలక సమాచారం రాబట్టిన కమిషన్, త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. కొందరు అధికారులు, కాళేశ్వరం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని చెప్పారు. హరీష్ రావు పాత్రపైనా కీలక సమాచారం అందించారు. ఇక కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి కేటీఆర్‌కు ఉన్న లింకులపై అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. నిజానిజాలన్నీ బయటకొస్తే, డిసాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కేసులుంటాయి. నిర్లక్ష్యం, కుట్రపూరితం అంటూ క్రమినల్ కేసులకు ఛాన్స్ ఉంది. అదే జరిగితే, గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు తప్పవు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొలిటికల్ బాంబుల ప్రస్తావన తెచ్చారని అంతా అనుకుంటున్నారు.

Related News

Salvo industries : అనామక కంపెనీకి బడా టెండర్.. కథంతా నడిపించిన ఆ లీడర్

Congress : మరో ఎన్నికల హామీ అమలుకు సర్కారు రె’ఢీ’

Janwada Farm House : సరే ఏం జరగలేదు.. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమా? – బీఆర్ఎస్ కు ఎంపీ అనిల్ కుమార్ సవాల్

CM Revanth Reddy: గృహ ప్రవేశాలు ఇలా కూడా చేస్తారా? తప్పేలేకుంటే ఎందుకు పారిపోయారు? కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

Rice Distribution In TG: తెలంగాణ ప్రజలకు తీపికబురు.. ఆ పథకం జనవరి నుండే ప్రారంభం.. ఇక వారికి పండగే!

KTR Tweet: ప్రత్యర్థి పార్టీలతో టీడీపీ కలిసింది.. అస్సలు నమ్మవద్దు.. గురి తప్పవద్దంటూ కేటీఆర్ సంచలన ట్వీట్

Bandi Sanjay – KTR: 7 రోజుల్లో సారీ చెప్పాలి.. రివర్స్ షాకిచ్చిన బండి సంజయ్.. కేటీఆర్ రిప్లై ఎలా ఉండెనో?

×