Homemade Bhringraj Hair Oil: శతాబ్దాలుగా ఆయుర్వేదంలో జుట్టు సమస్యలకు దివ్యౌషధంగా పరిగణించబడుతోంది బృంగరాజ్. అమ్మమ్మల కాలంలో, అడవుల్లో దొరికే బృంగరాజ్ ఆకులను తీసుకువచ్చి ఇంట్లోనే నూనెను తయారు చేసుకునేవారు. భృంగరాజ్ ఆయిల్‌లో ఉండే పోషకాలు జుట్టును లోపలి నుండి బలపరుస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా నిరోధిస్తాయి.
జుట్టును నల్లగా చేయడంలో కూడా ఈ నూనె చాలా ప్రభావవంతగా పనిచేస్తుంది. రెగ్యులర్ గా 30 రోజులు ఈ ఆయిల్ తలకు అప్లై చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భృంగరాజ్ ఆయిల్ యొక్క ప్రయోజనాలు:
1.జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
2.జుట్టు నల్లగా, మెరిసేలా చేస్తుంది.
3.జుట్టును బలంగా చేస్తుంది.
4.చుండ్రును తొలగిస్తుంది.
5.శిరోజాలను శుభ్రంగా ఉంచుతుంది.
6. జుట్టు పెరుగుదలను పెంచుతుంది.
7. తెల్ల జుట్టును మారుస్తుంది.
ఆయిల్ తయారీకి కావలసినవి:
1. బృంగరాజ్ ఆకులు – 50 గ్రాములు (తాజా లేదా పొడి)
2. కొబ్బరి నూనె – 250 గ్రాములు
3. నీరు – 1 కప్పు
భృంగరాజ్ ఆయిల్ తయారీ విధానం:
మీరు ఈ ఆయిల్ తయారీకి తాజా ఆకులను ఉపయోగిస్తుంటే కనక వాటిని కడిగి బాగా ఆరబెట్టండి. ఎండు ఆకులను నేరుగా ఉపయోగించవచ్చు.
బృంగరాజ్ ఆకులను మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.తర్వాత బాణలిలో పైన చెప్పిన మోతాదుల్లో కొబ్బరి నూనెను వేడి చేసి, వేడి నూనెలో బృంగరాజ్ పొడిని వేసి బాగా కలపాలి.
నూనె రంగు మారే వరకూ తక్కువ మంటపై ఉడికించాలి.తర్వాత గ్యాస్ ఆపేయాలి. ఆయిల్ పూర్తిగా చల్లబడిన తర్వాత ఒక డబ్బాలోకి వడకట్టండి.తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి.
Also Read: హెయిర్ కలర్ అవసరమే లేదు.. ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారిపోవడం పక్కా !
భృంగరాజ్ నూనెను తలకు ఎలా ఉపయోగించాలి ?
రాత్రి పడుకునే ముందు బృంగరాజ్ నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి.
భృంగరాజ్ నూనెను పెరుగు, ఎగ్‌తో కలిపి హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు.
మీరు మీ షాంపూలో దీనిని కలపి కూడా ఉపయోగించవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.