EPAPER

Kanguva Movie: ‘కంగువ’ కోసం దిశా పటాని రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Kanguva Movie: ‘కంగువ’ కోసం దిశా పటాని రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Kanguva : తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్, యాక్షన్ మూవీ కంగువ.. ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యాయి. తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సూర్య తెలుగు షోలలో సందడి చేస్తున్నారు. ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ గురించి వచ్చే ప్రతి చిన్న న్యూస్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మొన్నటివరకు సూర్య రెమ్యూనరేషన్ ఎక్కువ అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దిశా పటాని పారితోషికం గురించి ఓ వార్త హాట్ టాపిక్ అవుతుంది. ఈ మూవీకి అమ్మడు ఎంత చార్జ్ చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం..


కంగువ మూవీ.. 

హీరో సూర్య నటించిన ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘కంగువ’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీ నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. హీరో సూర్య వరుసగా ప్రమోషన్ ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.. కంగువ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో కానుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,500 థియేటర్లలో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. భారీ స్థాయిలో ఈ మూవీ విడుదల కాబోతుంది.. సౌత్ ఆడియన్స్ ఈ మూవీ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు.. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..


దిశా పటాని రెమ్యూనరేషన్.. 

స్టార్ హీరో సూర్య, దిశా పటాని జంటగా నటిస్తున్న సినిమా కంగువ.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీకృష్ణ, ప్రమోద్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‍ తో రూపొందించినట్టు అంచనా. కంగువ మూవీ రూ.2000 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంటుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాకు సూర్య రూ. 28 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు.. అలాగే దిశా పటాని రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కల్కి మూవీ కంటే.. రూ. 3 కోట్ల రూపాయాలు ఎక్కువనే దిశా పటానీ తీసుకున్నట్లు చెబుతోన్నారు. ఈ సినీమాలో కల్కి కన్నా ఎక్కువగానే తీసుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక మూవీ ఎలా మెప్పిస్తుందో చూడాలి..

Related News

Bail To Actor Darsan: నటుడు దర్శన్ కి బెయిల్ మంజూరు.. బయటకు వచ్చాక చేసే మొదటి పని అదే..?

Jagapathi Babu: చిన్న కూతురికి అలాంటి సలహా.. షాక్ లో ఫ్యాన్స్..!

Salaar 2 Update : నిలిచిపోయిన సలార్ సీక్వెల్… ఫ్యాన్స్‌ను పిచ్చొళ్లను చేశారుగా…

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

×