EPAPER

Sai Pallavi : మళ్ళీ తెరపైకి సాయి పల్లవి కాంట్రవర్సీ… టార్గెట్ చేస్తున్నదెవరు?

Sai Pallavi : మళ్ళీ తెరపైకి సాయి పల్లవి కాంట్రవర్సీ… టార్గెట్ చేస్తున్నదెవరు?

Sai Pallavi : నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి (Sai Pallavi)పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. దానికి కారణం గతంలో ఇండియన్ ఆర్మీ గురించి ఆమె చేసిన కొన్ని కామెంట్స్. మరి అసలు సాయి పల్లవి ఇండియన్ ఆర్మీ గురించి చేసిన కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఎందుకు అవి వివాదాస్పదం అవుతున్నాయి? అనే వివరాల్లోకి వెళితే…


ప్రస్తుతం సాయి పల్లవి ‘అమరన్’ (Amaran) అనే ఓ మేజర్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ కార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఈ సినిమా రూపొందింది. రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలో మేజర్ ముకుంద వరదరాజన్ నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో సాయి పల్లవి (Sai Pallavi) ఇండియన్ ఆర్మీ పై చేసిన కామెంట్స్ ని నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తూ సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారు. ఆ పాత ఇంటర్వ్యూలో పాకిస్తానీలకు భారత సైన్యం టెర్రరిస్టుల్లా కనిపిస్తోందని, భారతీయులకు పాక్ సైన్యం టెర్రరిస్ట్ లా కనిపిస్తోందని, అసలు అది ఏంటో తనకు అర్థం కాదు అంటూ హింస మంచిది కాదనే విధంగా చెప్పుకొచ్చింది. నిజానికి ‘విరాటపర్వం’ మూవీ చేస్తున్న టైంలో సాయి పల్లవి ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది.


ఆ సమయంలోనే కాశ్మీరీ పండిట్లపై అఘాయిత్యాలు, గో సంరక్షణ పేరుతో హింసకు సంబంధించిన కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది సాయి పల్లవి. ఇప్పుడు అదే ఇంటర్వ్యూలో ఇండియన్ ఆమెపై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ‘కొంతమంది జనాలు నోరు తెరిచే వరకు చాలా అందంగా కనిపిస్తారు. కానీ నోరు తెస్తే ఇది పరిస్థితి’ అంటూ సాయి పల్లవి వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇంకొంతమంది నాన్సెన్స్ మాట్లాడే ముందు నిజాలు తెలుసుకో, పాక్ బిన్ లాడెన్ వంటి ఎంతోమంది టెర్రరిస్టులను పెంచి పోషించింది. మన ఫోర్సెస్ మన దేశాన్ని అలాంటి ఎంతో మంది టెర్రరిస్ట్ నుంచి కాపాడారు. కాబట్టి దేశానికి కాపాడుతూ ప్రాణాలు అర్పిస్తున్న జవాన్లను ఇలా మాట్లాడి ఇన్సెల్ చేయొద్దు అంటూ ఫైర్ అవుతున్నారు. ఎక్కువగా జార్జియాలో ఉంటే ఇండియాలో జరిగే టెర్రర్ ఎటాక్స్ గురించి వీళ్ళకేం తెలుస్తుంది? అందుకే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు అంటూ ఫైర్ అవుతున్నారు.

అయితే నిజానికి సాయి పల్లవి (Sai Pallavi) కేవలం తనకు హింస నచ్చదు అనే విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే ఈ కామెంట్స్ చేసింది. కానీ కొంతమంది కావాలని ఆ వీడియోలోని ఒక చిన్న బిట్ ని ఇలా రిలీజ్ చేసి ఆమెను టార్గెట్ చేస్తున్నారు. దీంతో చాలామంది సాయి పల్లవికే సపోర్ట్ చేస్తున్నారు. కానీ అప్పుడు ఎప్పుడో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటకు తీసి ఇలా సాయి పల్లవిని బ్యాడ్ చేయడం వెనుక ఎవరి హస్తం ఉంది అనేది చర్చకు దారి తీసింది.

Related News

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

×