Jio Bharat 4G : దివాళీ సందర్భంగా రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంఛ్ చేసిన జియో భారత్ 4జీ మెబైల్స్ పై భారీ తగ్గింపును ప్రకటించింది.
కస్టమర్స్ ను ఆకట్టుకోవటానికి ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఎప్పుటికప్పుడు తన కస్టమర్స్ కోసం భారీ ఆఫర్స్ ను తీసుకొస్తున్న ఈ సంస్థ తాజాగా మరో అదిరిపోయే ఆఫర్ ను తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఎంతో ప్రతిష్టాత్మకంగా అతి తక్కువ ధరకే తీసుకువచ్చిన జియో భారత్ ఫోన్స్ పై దాదాపు 33 శాతం డిస్కౌంట్ ను ప్రకటించి కస్టమర్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని జియో తెలిపింది.
జియో భారత్ 4జీ మెబైల్స్ ను రిలయన్స్ లాంఛ్ చేసినపుడు దాని ధరను రూ. 999గా నిర్ణయించింది. ఇక ప్రస్తుతం సేల్ లో భాగంగా ఈ ఫోన్ ను కేవలం రూ.699కే కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇక నెలవారీ రీఛార్జ్ ఫ్లాన్స్ తో పోలిస్తే జియో ఫీచర్ ఫోన్ ప్లాన్లు తక్కువ ధరకే లభిస్తాాయని జియో తెలిపింది. ఇతర ప్లాన్స్ తో పోలిస్తే జియో ఫోన్స్ తో నెలకు దాదాపు 40 శాతం మేర అంటే దాదాపు రూ.76 చొప్పున ఆదా చేసే అవకాశం ఉందని తెలిపింది.
ALSO READ : గ్యాడ్జెట్స్ పై బంపరాఫర్.. ఏకంగా 70శాతం డిస్కౌంట్, వెరీ చీప్ గురూ..!
ఇక భారతీ మొబైల్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో భాగంగా రిలయన్స్ తన 4G ఫోన్స్ ను జియో భారత్ V3, V4 ఫోన్స్ పేరుతో ఆవిష్కరించింది. భారత్ లో 2G వినియోగదారులకు 4G సేవలను తేలికగా అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు జియో తెలిపింది. ఈ మెుబైాల్ లో యూపీఐ చెల్లింపుల కోసం జియో పే, లైవ్ టీవీ, స్ట్రీమింగ్ నిర్దిష్ట రీసెర్చ్ ప్లాన్ తో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు పలు సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది.
జియో ప్రారంభించిన భారత్ v2 మెుబైల్స్ సక్సెస్ కావడంతో.. సెప్టెంబర్ 14న జియో భారత్ v3, v4 మెుబైల్స్ లాంఛ్ చేసింది. ఇక ఈ కొత్త మోడల్స్ ను లేటెస్ట్ అప్డేట్స్ తో అందిస్తుంది. ఈ ఫోన్స్ లో 1000 mah బ్యాటరీ, 128GB వరకు స్టోరేజ్ ను ఎక్స్పాండ్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాయి. 23 భారతీయ భాషలకు ఇవి సపోర్ట్ చేయటమేకాకుండా… జియో టీవీ యాప్స్ కు యాక్సెస్ ను కూడా కలిగి ఉన్నాాయి. ఇందులో వినోదంతో పాటు పిల్లల ప్రోగ్రామింగ్ వార్తలు, 45 కు పైగా లైవ్ టీవీ ఛానల్స్ ప్రసారంకానున్నాయి. జియో సినిమాలో అందుబాటులో ఉన్న పలు షోస్, ఫిల్మ్స్, లైబ్రరీని సైతం యాక్సెస్ చేసే అవకాాశం ఉన్నట్లు తెలిపింది. జియో చాట్ యాప్ ను ఈ రిలయన్స్ జియో భారత్ v3, v4 మెుబైల్స్ లో చేర్చడం మరో ముఖ్యమైన ముందడుగనే చెప్పాలి.