Diwali Gifting Ideas : దీపావళి(Diwali) రాగానే మన సన్నిహితులకు, స్నేహితులకు, మనకు ఇష్టమైన వారికి ఈ సారి ఏం స్పెషల్ గిఫ్ట్(Diwali Special Gifts) ఇవ్వాలా అని అందరం ఆలోచిస్తాం. చాలామంది సంప్రదాయ పద్ధతులను అనుసరించి స్వీట్లు లేదా ఇతర బహుమతులు ఇస్తారు. అయితే ఈ దీపావళికి మీరు మీ ప్రియమైన వారికి కొంచెం కొత్తగా ఆశ్చర్యపరచాలనుకుంటే టెక్ బహుమతులు(Diwali Tech Gifts) ను కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ఈసారి కొత్తదాన్ని ఎందుకు ప్రయత్నించకూడదని భావిస్తే మీ సన్నిహితులకు, ఫ్యామిలీకి థ్రిల్ పంచే, రిలాక్సేషన్ ఇచ్చే టెక్ గిఫ్ట్‌లను ఇచ్చేయండి.
Honeywell Trueno U300 Bluetooth Speaker – ఈ పోర్టబుల్ స్పీకర్ 20 డబ్ల్యూ సౌండ్‌ను కలిగి ఉంది. మ్యూజిక్ లవర్స్‌ను బెస్ట్ ఛాయిస్. 4,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాదాపు 13 గంటల పాటు ఆగకుండా పనిచేస్తుంది. ఫాస్ట్ టైప్ సీ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.2,298. ఇంకా ఇందులో 15 మీటర్లకు వరకు కనెక్షన్ ఉండేలా బ్లూటూత్ V5.3 ఫీచర్ ఉంది. ఇండోర్, ఔట్‌డోర్‌లో రెండింటిలోనూ ఉపయోగించుకునేలా వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX6ను ఇచ్చారు. ఇంకా స్ట్రీరియో ఎక్స్పీరియన్స్ కోసం రెండు స్పీకర్స్‌ను కనెక్ట్ చేసేలా టీడబ్ల్యూఎస్ పెరియింగ్ ఆప్షన్ కూడా ఉంది.
Spigen 20,000mAh Power Bank – ఇది 30డబ్ల్యూ ఔట్పుట్తో వస్తుంది. ఐఫోన్ 14ప్రోను కూడా ఐదు సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రీమియమ్ అలయ్ మెటేరియల్‌తో డిజైన్ చేశారు. స్టైలిష్‌గా, మన్నికగా ఉంటుంది. ఫోస్ట్ పీపీఎస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. గంటలోనే 94 శాతం ఛార్జ్ చేస్తుంది. ఇది రూ.2,348కు అందుబాటులో ఉంది.
ALSO READ : ఎగిరి గెంతేసే రిలయన్స్ జియో ఆఫర్.. కేవలం రూ.699 4G స్మార్ట్ ఫోన్
CrossBeats Nexus ChatGPT-Powered Smartwatch – ఈ స్మార్ట్ వాచ్ గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. 2.01 అమోలెడ్ డిస్ ప్లేతోను కలిగి ఉంది. అలానే చాట్‌జీపీటీ, స్మూత్ నోటిఫికేషన్స్ కోసం అడ్వాన్స్డ్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో వాయిస్ రికజ్ఞిషన్ సదుపాయం కూడా ఉంది. ఇందులో 100 స్పోర్ట్స్ మోడ్స్, జీపీఎస్ నావిగేషన్, బీపీ, స్లీప్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. 6 రోజుల బ్యాటరీ లైఫ్‌తో పాటు బ్లూటూట్ కాలింగ్ వంటివి ఉన్నాయి. దీనిని రూ.3,599కు కొనుగోలు చేయొచ్చు.
Frontech Dragon Warrior Gaming Combo – మీ ఫ్యామిలీలో లేదా ఫ్రెండ్స్‌లో గేమింగ్ లవర్స్ ఉన్నారా? అయితే ఇది వారికి బాగా ఉపయోగపడుతుంది. దీని ధర రూ.1,451. ఈ కాంబో గేమర్స్‌కు చెస్ట్ ఛాయిస్. ఇందులో ఆర్జీబీ ఎల్ఈడీ కీబోర్డ్, 1000-డీపీఐ గేమింగ్ మోస్, డ్యూరబుల్ మౌస్‌ప్యాడ్ ఉంటాయి. అలానే క్లియర్ ఆడియో, బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 40ఎమ్ఎమ్ డ్రైవర్ యూనిట్ కలిగిన హెడ్సెట్ కూడా ఉంటుంది.
Welko Drone With 4K Camera – ఈ మధ్య కాలంలో డ్రోన్ కెమెరాలకు ఆదరణ బాగా పెరిగింది. సందర్భం ఏదైనా స్పష్టమైన విజువల్స్, స్టన్నింగ్ ఏరియల్ వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం దీన్ని బాగా వినియోగిస్తున్నారు. పైగా దీపావళి వస్తుంది. కాబట్టి డ్రోన్ కెమెరాను కొనుగోలు చేసి బెస్ట్ విజువల్స్‌ను క్యాప్చర్స్ చేయొచ్చు. ఈ వెల్కో డ్రోన్ 4కే అడ్జస్టబుల్ కెమెరాతో బెస్ట్ ఏరియల్ షాట్స్‌ను క్యాప్చర్ చేస్తుంది. ఇందులో గెస్టర్ కంట్రోల్, 360 ఫ్లిప్ కూడా ఉన్నాయి. దీన్ని సులభంగా క్యారీ చేయొచ్చు. ట్రెవెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీని బరువు కేవలం 188 గ్రాములే. 25 నిమిషాల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇది రూ.3,999కు అందుబాటులో ఉంటుంది.వ