TDP on Jagan Assets: తక్కువ కాలంలో అన్ని కోట్లు ఎలా సంపాదించారు.. టాటా, బిర్లా, అంబానీల ఆస్తులు కూడా ఈ రేషియోలో పెరగలేదు కదా.. మరి వీటికి సమాధానం ఏమి చెబుతారంటూ మాజీ సీఎం జగన్ కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇంతకు వర్ల రామయ్య చెప్పిన జగన్ ఆస్తుల వివరాలు చూస్తే షాక్ అవుతారంటూ టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఇటీవల మాజీ సీఎం జగన్ ఆస్తుల వివాదానికి సంబంధించి కుటుంబంలోని విభేధాలు బయటకు పొక్కిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా జగన్ వర్సెస్ షర్మిళ మధ్య మాటల యుద్దం సాగుతోంది. అలాగే ఇటీవల ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేర్ని నానిలు కూడా షర్మిళను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. అలాగే అసలు ఆస్తులకు సంబంధించి ఏమి జరిగిందో, వైఎస్సార్ అభిమానులకు మూడు పేజీల లేఖను కూడా రాశారు షర్మిళ.
ఇలా వీరి కుటుంబ వివాదం సాగుతున్న వేళ పొలిటికల్ బాంబ్ పేరిట, టీడీపీ సోషల్ మీడియా వేదికగా జగన్ కు షర్మిళ రాసిన లేఖ బయటకు రావడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కుటుంబంలో జరిగే వివాదాలపై దృష్టి సారించడం కన్నా, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జగన్ అన్నారు. అన్ని కుటుంబాలలో ఉన్నదే తమ కుటుంబంలో కూడా ఉందని, ఇందులో కొత్తేమి లేదని తమ ఆస్తుల వివాదంపై జగన్ స్పందించారు.
ఈ క్రమంలో నిన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చేసిన విమర్శలపై తాజాగా షర్మిళ సవాల్ విసిరారు. తన లేఖకు తాను కట్టుబడి ఉన్నట్లు, తన బిడ్డలపై ప్రమాణం చేస్తున్నానంటూ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు షర్మిళ. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా జగన్ కు ఆస్తుల వ్యవహారంపై తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.
వైఎస్ జగన్ వద్ద 8 లక్షల 32 వేల కోట్లు అక్రమ ఆస్తులు ఉన్నాయని రామయ్య ఆరోపించారు. 2004 సంవత్సరంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన ఎన్నికల అఫిడవిట్ లో చూపిన ఆస్తి రూ. 1.76 కోట్లు ఉండగా, 2009లో చూపింది రూ.2.6 కోట్లు మాత్రమేనన్నారు. జగన్ 2004 లో రూ.1.73 కోట్లు, 2009లో 38 కోట్లు, 2011 బై ఎలక్షన్లో 390.73 కోట్లుగా చూపడం విచిత్రంగా ఉందన్నారు. 2019 ఎలక్షన్లో రూ. 500 కోట్లు, 2024 ఎన్నికల్లో 757.65 కోట్లు చూపించారని, ఇంతలా పెరగడం ఎలా సంభవమంటూ ఆయన ప్రశ్నించారు. టాటా, బిర్లా, అంబానీల ఆస్తులు కూడా ఈ రేషియోలో పెరగలేదని, మీకు ఎలా సాధ్యమైందో ప్రజలకు కూడా కాస్త చెప్పండంటూ రామయ్య కోరారు. ఇలా వర్ల రామయ్య లెక్కలతో సహా ప్రకటించడంపై, వైసీపీ స్పందన ఎలా ఉంటుందో కానీ టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఈ పోస్ట్ ను వైరల్ చేస్తోంది.
జగన్ రెడ్డి వద్ద 8 లక్షల 32 వేల కోట్లు అక్రమ ఆస్తులు ఉన్నాయి. 2004 సంవత్సరంలో జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన ఎన్నికల అఫిడవిట్ లో చూపిన ఆస్తి రూ. 1.76 కోట్లు, 2009లో చూపింది రూ.2.6 కోట్లు మాత్రమే. జగన్ రెడ్డి 2004 లో రూ.1.73 కోట్లు,2009లో 38 కోట్లు, 2011 బై… pic.twitter.com/VfxSmHyMFw
— Telugu Desam Party (@JaiTDP) October 26, 2024