Rice Water: శతాబ్దాలుగా ఆసియా దేశాల్లో చర్మ సంరక్షణ కోసం బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు. దక్షిణ కొరియాలో, చర్మ సంరక్షణలో బియ్యం నీటిని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అనేక సౌందర్య ఉత్పత్తులలో బియ్యం నీటిని కూడా వాడుతుంటారు. దీన్ని సహజ టోనర్‌గా ఉపయోగించడం ద్వారా చర్మం అందంగా మారుతుంది. రైస్ వాటర్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా వాడాలి ? రైస్ వాటర్‌తో టోనర్ తయారు చేసే విధానం గురించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం నీళ్లతో టోనర్ తయారు చేయడం ఎలా ?
రైస్ వాటర్ టోనర్ తయారు చేయడం చాలా సులభం. మీరు కొన్ని వస్తువులను ఉపయోగించి ఇంట్లోనే టోనర్ తయారు చేసుకోవచ్చు.
కావలసినవి:
బియ్యం- 3 టేబుల్ స్పూన్లు
నీరు- చిన్న కప్పు
స్ప్రే బాటిల్-1
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని కడగాలి: ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని బాగా కడగాలి. వాషింగ్ సమయంలో నీటిని అనేక సార్లు మార్చండి.తద్వారా బియ్యంపై ఉన్న పిండి తొలగిపోతుంది.
బియ్యాన్ని నానబెట్టండి: కడిగిన బియ్యాన్ని ఒక పాత్రలో వేసి అందులో తగినన్ని నీళ్లు వేసి కలపండి. బియ్యాన్ని కనీసం 30 నిమిషాలు లేదా రాత్రి మొత్తం నానబెట్టండి.
నీటిని ఫిల్టర్ చేయండి: నానబెట్టిన బియ్యాన్ని వడకట్టండి. శుభ్రమైన సీసాలో నీటిని నింపండి.
నీటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి: ఫిల్టర్ చేసిన నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.
మీ ఇంట్లో తయారుచేసిన ఈ టోనర్ వాడటానికి సిద్ధంగా ఉంది.
రైస్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ?
విటమిన్-బి, ఇ, మినరల్స్ వంటి అనేక రకాల పోషకాలు బియ్యం నీటిలో ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.రైస్ వాటర్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
చర్మానికి పోషణనిస్తుంది: బియ్యం నీరు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది.
ఛాయను మెరుగుపరుస్తుంది: బియ్యం నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.అంతే కాకుండా చర్మ రంగును మెరుగుపరుస్తాయి.
మొటిమలను తగ్గిస్తుంది: బియ్యం నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు, ముఖంపై వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
రంధ్రాలను మూసివేస్తుంది: బియ్యం నీరు చర్మ రంధ్రాలను మూసివేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని ఆయిల్ ఫ్రీగా, మృదువుగా ఉంచుతుంది.
చర్మాన్ని బిగుతుగా చేస్తుంది: బియ్యం నీళ్లలో ఉండే అమినో యాసిడ్స్ చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడతాయి .
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: బియ్యం నీరు చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల చర్మం పొడిగా మారదు.
Also Read: జిడ్డు చర్మాన్ని కూడా ఈ ఫేస్‌తో మెరిసేలా చేయొచ్చు తెలుసా ?
రైస్ వాటర్ టోనర్ ఎలా అప్లై చేయాలి ?
రైస్ వాటర్ టోనర్ ముఖానికి అప్లై చేసే విధానం చాలా సులభం. మీరు దీన్ని ప్రతి రోజు వాడవచ్చు. దీనిని వాడే ముందు..
ముఖాన్ని శుభ్రం చేసుకోండి: ముందుగా మీ ముఖాన్ని మంచి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోండి.
టోనర్‌ను అప్లై చేయండి: తర్వాత కాటన్ లేదా స్ప్రే బాటిల్ సహాయంతో మీ ముఖంపై రైస్ వాటర్ టోనర్‌ని అప్లై చేయండి.
సున్నితంగా మసాజ్ చేయండి: టోనర్‌ని మీ ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి.
మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి : చివరగా మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.