Diwali 2024 : దీపావళి అత్యంత ముఖ్యమైన పండగల్లో ఒకటి. సనాతన ధర్మానికి సంబంధించిన ఈ పెద్ద పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దీపావళి రోజు రాత్రి కొన్ని ప్రత్యేక పరిహారాలు లేదా నివారణలు చేస్తే, నిద్రపోయే అదృష్టం కూడా మేల్కొంటుంది. దీంతో పాటు, జీవితంలోని అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి . అంతే కాకుండా ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి రోజు రాత్రి ఇంట్లో గుడ్లగూబ బొమ్మను ఉంచడం శ్రేయస్కరం. లక్ష్మీదేవి వాహనం అయిన గుడ్లగూబ ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి నివసించే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తుందని నమ్ముతారు. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సంపదలకు అధిదేవత అయిన మహాలక్ష్మీ అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది. అంతే కాకుండా మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ పరిహారాలు మీకు శుభాలను కలిగిస్తాయి.
దీపావళి రోజు రాత్రి వెండి గిన్నె లేదా మట్టి పాత్రలో దీపం వెలిగించండి. ఈ దీపంతో లక్ష్మీదేవికి ఆరతి ఇవ్వండి. ఇదే కాకుండా, స్ఫటిక శ్రీయంత్రాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి, సురక్షితంగా ఉంచండి. ఈ రెమెడీని పాటించడం వల్ల జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు . మీ జీవితంలోనూ కష్టాలు తొలగిపోతాయి. అంతే కాకుండా సంతోషంగా ఉంటారు. మీరు ఈ పరిహారం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.
దీపావళి రోజున ఒక రావి ఆకును తీసుకుని దానిపై కుంకుమ రాయండి. దీని తరువాత, ఈ ఆకుపై లడ్డూలను ఉంచి హనుమంతునికి నివేదన సమర్పించండి. ఈ పరిహారం చేయడం ద్వారా, హనుమంతుడు సంతోషిస్తాడు. ఫలితంగా మీ జీవితంలో వచ్చే సమస్యలను తొలగిస్తాడు. హనుమంతుడు అనుగ్రహం కోసం ఇలా చేయడం వల్ల మీ అదృష్టం కూడా పెరుగుతుంది.
దీపావళి రోజున, లక్ష్మీపూజలో పసుపు రంగులో ఉన్న కౌరీలను ఉంచండి.అలాగే పూజా గదిలో ఒక్క కొబ్బరికాయను ఉంచి పూజించాలి.దీపావళి పూజ తర్వాత, మీ పూజా గదిలో ఈ కొబ్బరికాయకు శాశ్వత స్థానం ఇవ్వండి. ఈ పరిహారం చేయడం వల్ల తల్లి లక్ష్మీ ప్రసన్నురాలవుతుంది. ఫలితంగా మీకు ఇంట్లో డబ్బు లోటు అస్సలు ఉండదు. సంపద వర్షం కురుస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
Also Read: దీపావళి రోజు 3 దీపాలతో ఈ పరిహారం చేస్తే.. మీ ఇంట్లో కనక వర్షమే !
దీపావళి పూజ సమయంలో ఎర్రటి గుడ్డ తీసుకుని అందులో ఐదు తమలపాకులు, ఐదు పసుపు ముడులు, ఐదు గోమతి చక్రాలు వేసి మూట కట్టాలి. లక్ష్మీ దేవిని పూజించే ప్రదేశంలో ఈ కట్టను ఉంచండి. పూజ తర్వాత, ఈ కట్టను మీ ఇల్లు లేదా సంస్థ యొక్క గుమ్మానికి కట్టండి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)