AP Crime News: ఇటీవల పలుచోట్ల ఆలయాలపై దాడులు జరిగిన ఘటనలు సంచలనంగా మారాయి. అయితే ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన మాత్రం అందుకు భిన్నం. మా అమ్మ అంటూ.. అమ్మవారి చెంత కూర్చొని హల్చల్ చేశాడు. ఈ యువకుడు కావాలంటే వీడియో తీసుకోండి.. అలాగే ఎమ్మెల్యేకు కూడా చెప్పుకోండి అంటూ.. తల్లీ కరుణించూ.. అంటూ ఏకంగా అలయంలోనే కూర్చొని హల్చల్ చేశాడు. ఇంతకు అసలేం జరిగిందంటే?
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆరవపల్లి ముత్తు మారమ్మ గుడిలోకి ఓ యువకుడు హఠాత్తుగా వచ్చాడు. చేతిలో కత్తి చేతబట్టి, చొక్కా కూడా లేకుండా నేరుగా ఆలయంలోకి చొరబడి, గట్టిగా కేకలు వేశాడు. దీనితో భక్తులు కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ యువకుడు ఏకంగా అమ్మవారి విగ్రహం వద్ద కూర్చున్నాడు. ఇక అంతే భక్తులు గుమికూడి దాడికి యత్నించేందుకు వచ్చాడా అంటూ కంగారు పడ్డారు.
అంతలోనే అమ్మా తల్లీ అంటూ.. అమ్మవారితో తనలో తానే మాట్లాడుతూ ఉండి పోయాడు. అతడిని పక్కకు తీసేందుకు భక్తులు సాహసించలేక, పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొనేలోగానే, రైల్వే పోలీసులు కూడా ఆలయం వద్దకు వచ్చారు. అప్పుడు తెలిసింది అసలు విషయం భక్తులకు. ఈ యువకుడి పేరు రాజేష్ కాగా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యువకుడిగా రైల్వే పోలీసులు చెప్పారు.
తమ వద్ద నుండి తప్పించుకొని, ఆలయంలోకి చొరబడినట్లు పోలీసులు తెలుపగా, అందరూ షాక్ తిన్నారు. అయినా సదరు యువకుడు మాత్రం అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చొని, ఎటువంటి హానీ తలపెట్టకుండా, మా అమ్మ.. మా తల్లి అంటూ అమ్మవారితో మాట్లాడుతూ ఉండి పోయాడు. అంతటితో ఆగక ఎమ్మెల్యేకు చెప్పుకోండి, వీడియో తీసుకోండి అంటూ చెప్పాడు. చివరికి స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, అతడిని పట్టుకొని రైల్వే పోలీసులకు అప్పగించారు.
చివరకు భక్తులు మాత్రం హమ్మయ్య.. పెద్ద గండం తప్పిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. కత్తి చేతిలో పట్టిన యువకుడు, దాడికి పాల్పడలేదని, చివరికి పోలీసులు బ్రతిమలాడి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు భక్తులు తెలిపారు. ఇంతకు ఈ యువకుడు ఏదైనా కేసులో నిందితుడా, లేక అనుమానితుడా అనేది మాత్రం తెలియరాలేదు. చివరికి రైల్వే పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారట. మరి హల్చల్ చేసిన యువకుడు మద్యం త్రాగినట్లుగా కూడా స్థానికులు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఘటన మాత్రం అన్నమయ్య జిల్లాలో సంచలనంగా మారింది.
అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని కత్తితో వ్యక్తి హల్ చల్
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆరవపల్లి ముత్తు మారమ్మ గుడిలో ఘటన
రైల్వే పోలీసుల నుంచి తప్పించుకుని గర్భగుడిలోకి వెళ్లి కత్తితో హల్ చల్ చేసిన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజేష్
వ్యక్తిని అదుపులోకి తీసుకుని రైల్వే… pic.twitter.com/zYOYFt5KiA
— BIG TV Breaking News (@bigtvtelugu) October 26, 2024