కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టీస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ కమిటీ దృష్టి సారించింది. కమిటీకి ఈ ప్రాజెక్ట్‌పై పలు ఫిర్యాదులు అందడంతో విచారణను ముమ్మరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై మాజీ ఈఎన్‌సి నల్లా వెంకటేశ్వర్లు విచారణ ముగిసింది . వెంకటేశ్వర్లును రెండు విడతలుగా కమిషన్ చీఫ్ విచారించారు. బహిరంగ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పలుమార్లు వెంకటేశ్వర్లు ప్రస్తావించారు. టెక్నికల్ అంశాల తర్వాత డీపీఆర్ ఎవరు అప్రూవల్ చేశారని వెంకటేశ్వర్లను ప్రశ్నించారు. డీపీఆర్ అప్రూవల్ మాజీ ముఖ్యమంత్రి చేశారని కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ చెప్పారు.
మరోవైపు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన సిట్.. కూపీ లాగే పనిలో పడింది. ఇందులో భాగంగా.. పలువురు కీలక అధికారులను అరెస్ట్ చేసింది. వారిని కస్టడీకి తీసుకొని కీలక విషయాలను రాబట్టే పనిలో పడింది. విధ్వంసమైన ఆధారాలను కూడా రికవరీ చేసి.. అసలేం జరిగిందన్న విషయాలను బయటపెట్టాలని చూస్తోంది. దీంతో ఈ కేసు వ్యవహారం జాతీయ స్థాయిలోనూ అత్యంత హాట్ టాపిక్ గా మారింది. కేవలం ప్రతిపక్ష పార్టీల నేతలే కాకుండా.. పలువురు ప్రముఖుల సమాచారాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్‌తో సేకరించారనే వార్తలు వస్తున్నాయి.
Also Read: కేటీఆర్ పిచ్చి పట్టిందా! జగ్గా రెడ్డి పైర్
తెలంగాణలో వెలుగచూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులోని అన్ని విషయాలను బయటపెట్టాలని కోరుతున్నాయి. అయితే గత పదేళ్ల నుంచి మాత్రమే కాకుండా 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యహారాలని బయపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కేవలం అరెస్టులపై మాత్రం పలు ప్రకటనలు విడుదల కాగా ఏం జరిగిందనే దానిపై అధికారికంగా ప్రకటనలు రాలేదు.
ఆ క్రమంలో విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరని, సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయని, కక్ష సాధింపు కోసం కాదు, సాక్ష్యాధారాలతోనే చర్యలు తీసుకుంటామని ఆయన బాంబు పేల్చారు. ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలుంటాయని పొంగులేటి వ్యాఖ్యానించారు. తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్ బాంబ్ లు పేలనున్నాయని మంత్రి చెప్పారు దక్షిణ కొరియా సియోల్‌లో హన్ నది పునరుజ్జీవన పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన మంత్రి పొంగులేటి అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి వంటి సుమారు 8 నుంచి 10 ప్రధాన వ్యవహారాలకు సంబంధించి ఈ చర్యలు ఉంటాయన్నారు. దీనికి సంబంధించి ఫైళ్లు పూర్తి సాక్ష్యాధారాలతో సిద్ధమయ్యాయని మంత్రి పొంగులేటి వివరించారు.
తాను సియోల్ నుంచి మరో 2 రోజుల్లో హైదరాబాద్ చేరేసరికల్లా చర్యలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పొంగులేటి పేర్కొనడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్ర ఘోష్ కమిటీ విచారణలో మాజీ ఈఎన్సీ పదేపదే కేసీఆర్ పేరు ప్రస్తావించిన నేపధ్యలో ఈ వ్యవహారాలకు సంబంధించి రేవంత్‌రెడ్డి సర్కారు ఎవరిని ఫ్రేమ్ చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది