Shraddha Kapoor: హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఫుల్‌జోష్‌లో ఉంది. ఆమె నటించిన స్ట్రీ 2 మూవీ బాక్సాఫీసుకు కాసుల పంట పడింది.
ఇప్పటివరకు ఇంకా ఏ ప్రాజెక్టుకు కమిట్ కాలేదు. దాదాపు 37 ఏళ్ల శ్రద్దా.. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు.
టీన్ పట్టి సినిమాతో గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కడి నుంచి ఏ మాత్రం వెనుదిరిగి చూడలేదు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన సాహోలో నటించింది కూడా.
కేవలం హీరోయిన్ల రోల్ మాత్రమే చూడకుండా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్‌లో దర్శినమిస్తోంది.
ఆమెకి అంత క్రేజ్ తెచ్చిందని చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లలో శ్రద్ధకపూర్ ఒకరు.
తనకు సంబంధించి ఫోటోషూట్లు పెడుతూనే ఉంటుంది. ఆమెకి క్రేజ్ రావడానికి అదీ కూడా ఓ కారణంగా బీటౌన్‌లో చెబుతుంటారు.
లేటెస్ట్ గా సిల్వర్ కలర్ శారీలో ఫోటోషూట్ ఇచ్చింది. నార్మల్‌గా శ్రద్ధా కపూర్ అందగత్తె. దానికితోడు ఆ శారీలో మెరిసిపోతోంది. దానిపై ఓ లుక్కేద్దాం.