EPAPER

TTD Employees Bank elections: తిరుమలలో ఎన్నికల హడావుడి.. పకడ్బందీగా ఏర్పాట్లు.. ఓటర్లు వీళ్లే

TTD Employees Bank elections: తిరుమలలో ఎన్నికల హడావుడి.. పకడ్బందీగా ఏర్పాట్లు.. ఓటర్లు వీళ్లే

TTD Employees Bank elections: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో ఎన్నికల హడావుడి నెలకొంది. ఇదేదో పాలక కమిటీ ఎన్నికలు అనుకుంటే పొరబడినట్లే. ఈ ఎన్నికలు ఈనెల 28వతేదీన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంతకు తిరుమల ఏమిటి? ఎన్నికలు ఏమిటి అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదివేయండి మరి.
తిరుమలలో ఈనెల 28వ తేది నిర్వహించ‌నున్న టీటీడీ ఎంప్లాయిస్ కో-ఆప‌రేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌ ఎన్నిక‌లకు ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని టీటీడీ జేఈఓ గౌత‌మి అధికారుల‌ను ఆదేశించారు. టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో సంబంధిత అధికారుల‌తో జేఈవో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని ఎస్వీ హైస్కూల్‌, తిరుప‌తిలోని ఎస్‌.జీ.ఎస్‌.హైస్కూల్ లో ఎన్నిక‌ల కేంద్రాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. తిరుమ‌ల‌లో ప‌ని చేసే ఉద్యోగులు ఎస్వీ హైస్కూల్ లో, తిరుప‌తి, ఇత‌ర ప్రాంతాల్లో ప‌ని చేసే ఉద్యోగులు ఎస్‌.జీ.ఎస్ హైస్కూల్ లో ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌న్నారు.


దివ్యాంగుల‌కు గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల‌న్నారు. ఉద‌యం 7 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌చ్చని చెప్పారు. ఓటు వేసేందుకు వ‌చ్చే ప్రతి ఉద్యోగి త‌మ ఒరిజిన‌ల్ ఐడీ కార్డు త‌ప్పనిస‌రిగా తీసుకు రావాల‌ని అన్నారు. ఎన్నిక‌ల కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమ‌తించ‌బ‌డ‌వ‌నీ, సెల్ ఫోన్ల డిపాజిట్ కు ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాల‌న్నారు.

అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు జ‌న‌రేట‌ర్లు, మైకుల‌ను అందుబాటులో ఉంచుకుని ప‌బ్లిక్ అడ్రస్ సిస్టమ్ కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. విజిలెన్స్ విభాగం సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ గార్డుల‌తో పాటు స్థానిక పోలీసుల‌తో స‌మ‌న్వయం చేసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే టీటీడీ ఐటీ విభాగం, ఇంజినీరింగ్, సెక్యూరిటీ విభాగాల‌కు త‌మ విధుల‌పై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప‌రేటివ్ అధికారి ల‌క్ష్మి, ఎన్నిక‌ల అధికారి ఉమాప‌తి, ఝాన్సీ, వారి సిబ్బంది, టీటీడీ వెల్ఫేర్ అధికారి ఆనంద‌రాజు, ఎస్ఈలు మ‌నోహ‌రం, వేంక‌టేశ్వర్లు, వీజీఓ స‌దాల‌క్ష్మి, హెల్త్ ఆఫీస‌ర్ ఆశాలత, సీఎంవో Dr. నర్మద‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.


Also Read: ఈ 5 రాశులు కలవారిపై శనిదేవుని కృప

ఇక,
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే శుక్రవారం స్వామి వారిని 56,501 మంది భక్తులు దర్శించుకోగా.. 21,203 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.78 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా 5 కంపార్ట్ మెంట్ లలో భక్తులు, స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు.

Related News

CPI Narayana: వైఎస్ఆర్ ఆస్తుల వివాదం.. నోరు విప్పిన నారాయణ

YCP Counter Letter: వైసీపీ కౌంటర్ లెటర్.. త్రిమూర్తులను కాపాడేందుకేనా?

Tirumala Updates: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ సమాచారం మీ కోసమే!

Bomb Threat to Visakha Airport : విశాఖ విమానాశ్రయంలో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. సర్వీసులు రద్దు

Vijayamma Open Letter : వైఎస్సార్ చివరి రోజుల్లో జగన్ ఆ మాట అన్నాడు.. పదేళ్లే కలిసున్నాం – కీలక విషయాలు చెప్పిన విజయమ్మ

YS Vijayamma Open Letter : మీరు విమర్శిస్తోంది వైఎస్సార్ కుటుంబాన్నే.. వైసీపీ నేతలపై విజయమ్మ ఫైర్, బహిరంగ లేఖ విడుదల

PV Sindhu: ఆ భూమిని సింధుకు ఇవ్వొద్దు, కాలేజీ కట్టండి.. స్థానికుల డిమాండ్

×