Rudra Mantram: శివుడు మహిమాన్విత దేవుడని హిందువుల నమ్మకం. శివుడి ఉగ్రరూపాన్ని ప్రశాంతపరచడానికి రుద్రమంత్రాలను పఠిస్తారు. ప్రతి సోమవారం శివుడికి అంకితం చేశారు. ఆ సోమవారం నాడు రుద్ర మంత్రాన్ని పఠించడం వల్ల మీ జీవితానికి ప్రాణానికి కూడా రక్షణ లభిస్తుందని చెబుతారు. సోమవారం ఉదయం తలకు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని శివలింగానికి ఎదురుగా కూర్చోవాలి. మొదటగా శివలింగంపై గంగాజలంతో అభిషేకం చేయాలి. తర్వాత బిల్వపత్రాలు, పండ్లు, పువ్వులు, గంధం వంటివి సమర్పించి రుద్రమంత్రాన్ని చదవడం ప్రారంభించాలి.
రుద్ర మంత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి?
రుద్రమంత్రాన్ని 108, 121, 133, లేదా 14,611 సార్లు పఠించవచ్చు. మీ సమయాన్నిబట్టి ఎన్నిసార్లు పఠించాలో నిర్ధారణ చేసుకోండి. ఈ రుద్రమంత్రాన్ని పఠించేటప్పుడు ప్రతి పదాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. ఇక్కడ మేము రుద్ర మంత్రాన్ని ఇచ్చాము. ఈ రుద్ర మంత్రాన్ని ఎన్ని సార్లు జపించాలో నిర్ణయించుకోండి.
ఇదిగో రుద్రమంత్రం
ఓం నమో భగవతే రుద్రాయ
నమస్తే రుద్రమన్యవ ఉత్తోత ఈశవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః
యాత ఇషుః శివతమా శివం బభూవ తే
ధనుః శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ
యా తే రుద్ర శివా తనూరఘోరాపకాశినీ
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి
యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవ
శివాం గిరిత్ర తాం కురు మా హింసీః పురుశం జగత్
శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి
యథా నః సర్వమిజ్జగదయక్ష్మం సుమనా అసత్
అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్
అహీః శ్చ సర్వాన్జంభయన్ సర్వాశ్చ యాతుధాన్యః
అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః
యే చెమాం రుద్రా అభితో దీక్షు శృతసప్తయః
యే తీష్టంతి రోషితో ద్రాపా ఉతాహ్న్యః
యేషాం విషం మయి శిరో దదామి
అసౌ యోఅవసర్పతి నీలా గ్రీవో విలోహితః
ఉతైనం గోపా ఆదృశన్నాదృశన్నుదహార్యః
ఉతైనం విషా భూతాని స దృష్టో మృడయాతి నః
నమో అస్తు నీలా గ్రీవాయ సహస్రాక్షాయ మీఘుషే
అథో య ఇషుధి స్థస్తే భవంతు నం ఉతాదిటిః
సహస్రాణి సహస్రధా బాహువో హేతయః సమీ
రుద్రమంత్రం పఠిస్తే ఏం జరుగుతుంది?
రుద్రమంత్రాన్ని పఠించడం వల్ల మీకున్న ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. ఆ శివుని అనుగ్రహాన్ని మీరు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా మీకు విజయం లభిస్తుంది. అనేక వ్యాధుల నుండి మీకు ఉపశమనం దక్కుతుంది. రుద్రమంత్రాన్ని ప్రతి వారం తప్పకుండా సోమవారం పఠించడం నేర్చుకోండి. మీకు మానసిక అశాంతి వంటి సమస్యలు ఉంటే రుద్రమంత్రాన్ని పఠించడం వల్ల మీరు ఆ సమస్యల నుంచి బయటపడతారు. మీలో ఆధ్యాత్మిక శక్తిని పెంచడంలో రుద్ర మంత్రం శక్తివంతంగా పనిచేస్తుంది. మీ ఆత్మను శుద్ధి చేయడానికి ఈ మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది.
రుద్ర మంత్రం పఠించడం వలన మీకు జీవితంలో కావలసిన సకల శుభాలు దక్కుతాయి. ఆయురారోగ్యాలు సంతోషం, ధనం అన్నీ మీరు ఉన్నచోట లభిస్తాయి. అందుకోసం మీరు ఏకాగ్రతతో రుద్ర మంత్రాన్ని జపించడం అలవాటు చేసుకోండి.