Shobhitha dulipala : ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhitha dhulipala) తన అద్భుతమైన నటనతో, అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న శోభిత ఇటీవల అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaitanya) తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. కష్టపడకుండానే ఒక్క నైట్ తో పాపులారిటీ లభించిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నిశ్చితార్థం జరగడంతో పెళ్లెప్పుడు..? ఇండియాలోనా? లేక విదేశాల్లో చేసుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ కూడా నడుస్తుండగా.. ఇప్పుడు తాజాగా శోభిత ధూళిపాళ అందరికీ షాక్ ఇచ్చింది.
ఇంగ్లాండ్ లో బయటపడ్డ చైతూ – శోభిత ప్రేమ..
ఇకపోతే నాగచైతన్య, శోభిత ఇద్దరూ ప్రేమలో పడ్డ విషయం ఇంగ్లాండ్ లో వీరిద్దరి ప్రైవేట్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు బయటకు రావడమే. ఇంగ్లాండ్లోని ఒక హోటల్ లో నాగచైతన్య అక్కడి చెఫ్ తో ఫోటో దిగగా వెనకాలే శోభిత కనిపించింది. ఇక అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్త తెరపైకి వచ్చింది. ఇలా ఇద్దరి మధ్య ఏదో ఉందని ఎన్నో రకాలుగా వార్తలు బయటకు వచ్చినా.. ఎవరు కూడా దీనిని పట్టించుకోలేదు. కానీ ఒక్కసారిగా నిశ్చితార్థంతో ఒక్కటి కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అటు శోభితకి కూడా భారీ పాపులారిటీ లభించింది. ఇకపోతే ఎంగేజ్మెంట్ జరిగింది సరే.. పెళ్లెప్పుడు అనే చర్చ మొదలైంది.. దీనిపై అక్కినేని , ధూళిపాళ కుటుంబాలు చాలా గుట్టు గానే పనులు చేస్తున్నాయని చెప్పవచ్చు.
శోభిత ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకలు..
మరోవైపు నాగచైతన్య (Naga Chaitanya), నాగార్జున(Nagarjuna )లను మీడియా కూపీ లాగే ప్రయత్నం చేసినా.. వారు మాత్రం సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ పక్కకు తప్పుకున్నారు. ఇక పెళ్లెప్పుడు అంటూ రకరకాల కథనాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. గత కొద్దిరోజుల క్రితం శోభిత తన ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయని, అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె స్వయంగా షేర్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ కుటుంబానికి చెందిన ముత్తైదువులు వెంటరాగా.. సాంప్రదాయంగా పట్టు చీరలో చాలా అందంగా ముస్తాబైన శోభిత, పసుపు కొమ్మలను తీసుకొస్తూ కనిపించింది . ఆ తర్వాత బంధుమిత్రులతో కలిసి స్వయంగా ఆమె పసుపు దంచారు కూడా.. ఆ తర్వాత ప్రత్యేక పూజలు , పెద్దల ఆశీర్వాదం అన్నీ పద్ధతి ప్రకారమే నిర్వహించారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేయడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అందరికీ హింట్ ఇచ్చారు.
హల్దీ ఫంక్షన్.. షాక్ ఇచ్చిన శోభిత..
అంతేకాదు సడన్ గా ఈరోజు హల్దీ ఫంక్షన్ ఫోటోలు షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శోభిత తన బంధుమిత్రులతో కలిసి డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే ఇక్కడ పెళ్లికూతురు గెటప్ లో శోభితాకు బదులు ఇంకో అమ్మాయి కనిపించింది.అదేనండీ, ఆమె చెల్లెలు సమంత కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమంత వృత్తిరీత్యా డాక్టర్. రెండేళ్ల క్రితమే సాహిల్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇప్పుడు ఈమె తన పెళ్లి నాటి సంగీత , హల్దీ వేడుకలు ఫోటోలను సమంత షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సమంత జనాలని పిచ్చోళ్ళని చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలే శోభిత, నాగచైతన్య పెళ్లి గురించి ఎలాంటి షాక్ ఇస్తారు అని జనం ఎదురుచూస్తున్న వేళ సమంత ఈ టైంలో ఇలాంటి ఫోటోలు చేయడం ఆసక్తికరంగా మారింది.
View this post on Instagram