MS DHONI: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( MS DHONI ) బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. జార్ఖండ్ లో ( Jharkhand) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెస్ ధోని ఫోటోలు వాడుకోవడానికి ఎన్నికల కమిషన్ అనుమతిని ఇచ్చిందని ఝార్ఖండ్ కు ( Jharkhand) చెందిన ఎన్నికల అధికారి కే. రవికుమార్ తెలియజేశారు.
Also Read: IND VS NZ: న్యూజిలాండ్ ఆలౌట్..టీమిండియా టార్గెంట్ ఎంతంటే?
ధోని ( MS DHONI ) ఫోటోను వాడుకోవడానికి ఎన్నికల కమిషన్ కు మహేంద్ర సింగ్ ధోని అంగీకారం తెలియజేశారు. ఇతర వివరాల కోసం మేము ధోనితో సంప్రదింపులు జరుపుతున్నాం. మహేంద్రసింగ్ ధోని ఓటర్ల సమీకరణకు తప్పకుండా కృషి చేస్తారని రవికుమార్ ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమం కింద ఓటర్లలో ప్రతి ఒక్కరికి అవగాహన పెంచడానికి మహేంద్రసింగ్ ధోని ( MS DHONI ) తన వంతు పాత్ర పోషించనున్నాడు.
ముఖ్యంగా భారీగా పోలింగ్ అయ్యేలా, అధిక సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యేలా ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని పెంచడానికి ధోని అభ్యర్థనలను, ప్రజాధరణను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇకపోతే జార్ఖండ్ ( Jharkhand) అసెంబ్లీ లోని 81 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ ను నిర్వహించనున్నారు. నవంబర్ 13 తొలిదశ, నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా…. ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోని ( MS DHONI ) మాట్లాడుతూ భావోద్వేగాలు, నిబద్ధతలను పరిగణలోకి తీసుకుంటే ప్రొఫెషనల్ ఆట ఆడడం అంత సులభం కాదంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: Glasgow Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !
అయితే మరికొన్నాళ్లు ఆడేందుకు ధోని సిద్ధమయ్యాడని ఈ మాటతో తెలుస్తోంది. నేను గత కొన్నేళ్లుగా క్రికెట్ ను ఆస్వాదించాలని అనుకుంటున్నాను. నా చిన్నతనంలో సాయంత్రం నాలుగు గంటలకు ఆడే ఆటను ఆస్వాదించాను. కానీ ప్రొఫెషనల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు ఆటలాగే క్రికెట్ ను ఆస్వాదిస్తారు. ఇది చాలా కష్టం.
భావోద్వేగాలు ఉంటాయి. నేను రాబోయే కొన్ని సంవత్సరాలు ఆటని ఇంకా ఆస్వాదించాలని అనుకుంటున్నాను అంటూ ధోని ( MS DHONI ) వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా… మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోని.. కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు చాంఫియన్ గా నిలిచింది. రెండు సార్లు ఫైనల్స్ కు చేరింది.