Manchu Lakshmi.. సాధారణంగా పండుగ వచ్చిందంటే చాలు పలు బుల్లితెర ఛానల్స్ ఆడియన్స్ ను టీవీకి కట్టిపడేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అందులో భాగంగానే సెలబ్రిటీలు, యాంకర్లు, జబర్దస్త్ కమెడియన్లు కూడా కొత్త షో తో ముస్తాబయి ప్రేక్షకులను అలరిస్తారు. ఇక ఆటపాటలతో పాటు నవ్వించే స్కిట్స్ తో పెర్ఫామ్ చేస్తారు. డాన్సులతో అబ్బురపరుస్తారు. అంతేకాదు తమ జీవితంలో జరిగిన సంఘటనలను కూడా స్కిట్ రూపంలో చేసి అందరిని కంటతడి పెట్టిస్తారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 31వ తేదీన దీపావళి పండుగ రాబోతోంది. ఈ పండుగకు జబర్దస్త్ గ్యాంగ్ తో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా సిద్ధం అయిపోయారు. తాజాగా ఈ దీపావళికి మోత మోగిపోద్ది అనే ఈవెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఇక తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేయడం జరిగింది.ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మీ (Manchu Lakshmi) కారణంగా ఆమె పిల్లలు స్కూల్లో ఎంత అవమానపడ్డారో స్కిట్ రూపంలో చూపించారు. ఇక ఆ స్కిట్ చూసి మంచు లక్ష్మి కంటతడి పెట్టుకుంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అందరి ముందే అనసూయకి ప్రపోజ్ చేసిన ప్రసాద్..
ఇకపోతే “ఈ దీపావళికి మూత మోగిపోద్ది” అనే కార్యక్రమం ఈటీవీ వారు నిర్వహిస్తూ ఉండగా ఇందులో మంచు లక్ష్మీ, అనసూయ పోటీ పడబోతున్నారు. అను బాంబ్ అంటూ అనసూయను, లక్ష్మీ బాంబ్ అంటూ మంచు లక్ష్మీ ని చూపించారు. శ్రీముఖి (Sreemukhi) ఈ కార్యక్రమానికి యాంకర్ గా చేస్తున్నారు. ఇదిలా ఉండగా కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో పెద్దోడు పాత్రలో నటించిన ప్రసాద్ (Prasadh) కూడా ఈ షోలో సందడి చేశారు. ఇక్కడున్న అమ్మాయిల్లో ప్రపోజ్ చేయాలంటే ఎవరికి చేస్తారు అని శ్రీముఖి, ప్రసాద్ ను అడిగింది. ప్రొద్దున లేవగానే ఇంస్టాగ్రామ్ లో అనసూయ వీడియోస్ ను చూస్తాను కాబట్టి ఇక్కడ ఆవిడకే ప్రపోజ్ చేస్తాను. అంటూ షాక్ ఇచ్చాడు. దీంతో అనసూయ మోములో సిగ్గు మొగ్గలేచింది. ఇక వెంటనే ప్రసాద్ మోకాళ్ళపై నిలబడి అనసూయ గారు నాతో కాఫీ తాగడానికి డేట్ కి వస్తారా అని అడిగాడు. అలా ఈ స్కిట్ నవ్వులు పూయించింది.
మంచు లక్ష్మీ ఇంగ్లీష్ పై ట్రోల్స్.. అవమానపడ్డ పిల్లలు..
ఆ తర్వాత మంచు లక్ష్మీ ఇంగ్లీష్ పై సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిపై చిన్న స్కిట్ కూడా చేశారు. మంచు లక్ష్మీ ఇంగ్లీష్ వల్ల ఆమె పిల్లలు స్కూల్లో ఎలా అవమానాలకు గురయ్యారో కూడా స్కిట్ లో చూపించారు. అది చూసిన మంచు లక్ష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. ఏది ఏమైనా మంచు లక్ష్మీ అలా స్టేజ్ పై ఏడవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఫైర్ బ్రాండ్ లా ఉండే మంచు లక్ష్మీ తన లాంగ్వేజ్ కారణంగానే స్కూల్లో తన పిల్లలు పడ్డ అవమానాలను తలుచుకొని మరింత కంటతడి పెట్టుకుంది.