Rahul Gandhi Meets Barber| దేశంలో ప్రతిరోజూ పెరుగుతున్న ధరల ధాటికి సామాన్యులు, పేదవారు, కష్టజీవులు విలవిల్లాడుతున్నారు. తక్కువ ఆదాయం ఒకవైపు.. నిత్యం పెరిగిపోతున్న ధరలు మరోవైపు. రెండింటి మధ్య సామాన్య ప్రజల బతుకులు నలిగిపోతున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసి వివరించారు.
ఆ వీడియోలో రాహుల్ గాందీ ఒక గెడ్డం ట్రిమ్ చేసుకోవాడనికి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ కు వెళ్లారు. అక్కడ ఒక బార్బర్ షాపులో వెళ్లి మంగలి పని చేస్తున్న అజిత్ అనే వ్యక్తితో కాసేపు ముచ్చటించారు. ఈ వీడియోలో రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ ధరించే తెల్లని టీ షర్టు వేసుకొని ఉన్నారు.
రాహుల్ గాంధీ బార్బర్ షాపులో గెడ్డం ట్రిమ్ చేసుకునేందుకు కూర్చొని ఒక పింక్ టవల్ మెడకు చుట్టుకున్నారు. ఆ తరువాత దాదాపు 50 ఏళ్ల వయసున్న అజిత్ తో అతని జీవితం, ఆదాయం, ఖర్చుల గురించి ప్రశ్నించారు. అప్పుడు మంగలి పనిచేసే అజిత్ తనకు నెల ఆదాయం కేవలం రూ.14000 నుంచి రూ.15000 వరకు వస్తుందని చెప్పాడు. తాను దివ్యాంగుడు కావడంతో అదనంగా రూ.2500 పించను వస్తుందని తెలిపాడు. కానీ ఆదాయం నుంచి ఖర్చులు మినహాయిస్తే ఏమీ మిగలదని అప్పుడప్పుడూ ఖర్చులే ఎక్కువగా ఉంటాయిని చెప్పాడు.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
ఖర్చుల విషయానికి వస్తే.. తనకు ఇంటి రెంటు, షాపు రెంటు, పిల్లల చదువులు, గుండె జబ్బు ఉన్న భార్య అనారోగ్యం కారణంగా ఆదాయం సరిపోవడం లేదని చెప్పాడు. ఈ ఖర్చులకు తోడు నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండడంతో తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు వెల్లడించాడు. తన పిల్లలకు పై చదువుల కోసం తన వద్ద ఏమీ లేదని కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఢిల్లీలో ఎన్నో కలలుగని షాపు ప్రారంభించానని చెప్పాడు. తన లాంటి సామాన్యుల గురించి ఎవరూ ఆలోచించరని.. కాంగ్రెస్ పాలనలో ధరలు తక్కువగా ఉండడంతో తాను సంతోషంగా జీవించేవాడినని చెప్పాడు.
అజిత్ కన్నీళ్లు తుడిచిన తరువాత రాహుల్ గాంధీ.. బార్బర్ షాపులో గెడ్డం ట్రిమ్ చేయించుకున్న తరువాత ధైర్యంగా ఉండాలని.. చెప్పి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత ట్విట్టర్ ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి.. ఒక సందేశమిచ్చారు. ” .. ‘ఏమీ మిగలడం లేదు’.. అజిత్ చెప్పిన ఈ నాలుగు పదాలు, అతని కన్నీళ్లు దేశంలోని ప్రతికష్టజీవి ఆవేదనను తెలుపుతున్నాయి. నేటి భారతదేశంలో పేదవారు, మధ్యతరగతి వాళ్లు పడుతున్న కష్టాల గురించి తెలియజేస్తున్నాయి.
మంగలి వాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లు, కుమ్మరి పని, కార్పెంటర్ పనిచేసే వారి ఆదాయం పెరగడంలేదు. కానీ ధరలు మాత్రం రోజూ పెరుగుతూ పోతున్నాయి. ఈ కష్టజీవులు తమకంటూ ఒక సొంత ఇల్లు, సొంత షాపు కావాలని కనే కలలు.. కలలుగానే మిగిలిపోతున్నాయి. వారి ఆత్మాభిమానం ప్రతిరోజు ఛిద్రమవుతోంది. వీరి సమస్యలను ఆధునికంగా పరిష్కారాలు అన్వేషించే అవసరం ఉంది. వీరి ఆదాయం పెరిగి కాస్త మిగిలేందుకు కొత్త పథకాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే నైపుణ్యానికి గౌరవం దక్కుతుందో ఆ సమాజమే అభివృద్ధి చెందుతుంది.” అని ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ తరుచూ సామాన్యులతో కలుస్తూ ఉంటారు. ఆయన భవన నిర్మాణ కూలీలు, మెకానిక్స్, ట్రక్కు డ్రైవర్లు, చెప్పులు కుట్టేవారు.. ఇలాంటి కష్టపడే వారితో మాట్లాడుతూ వారి కష్టాల గురించి ఆరాతీస్తూ ఉంటారు. ఇంతకుముందు లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ ఒక బార్బర్ షాపులో వెళ్లి వారిని పలకరించారు. వారి కష్టాలు తెలుసుకున్నాక.. ఆ తరువాత షాపులో కొత్త కుర్చీలు, షాంపులు, లాంటి సామాగ్రి కానుకగా పంపించారు. ఆ తరువాత నుంచి ఆ షాపుకు వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
"कुछ नहीं बचता है!"
अजीत भाई के ये चार शब्द और उनके आसूं आज भारत के हर मेहनतकश गरीब और मध्यमवर्गीय की कहानी बयां कर रहे हैं।
नाई से लेकर मोची, कुम्हार से लेकर बढ़ई – घटती आमदनी और बढ़ती महंगाई ने हाथ से काम करने वालों से अपनी दुकान, अपना मकान और स्वाभिमान तक के अरमान छीन लिए… pic.twitter.com/1gYGdui2ll
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2024