Jagga Reddy Press Meet: కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దండుపాళ్యం ముఠాగా తయారయిందన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్, హరీష్ రావుకు పిచ్చిపట్టిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చర్యలతో కేటీఆర్, హరీష్ రావులు తిట్లు తింటున్నారని జగ్గారెడ్డి విమర్శలుగుప్పించారు.
అమెరికా, సింగపూర్‌ల నుంచి సోషల్ మీడియా నడపడం కాదు.. దమ్ముంటే ధైర్యంగా ముందుకు రండి అంటూ జగ్గారెడ్డి ఛాలెంజ్ చేశారు. సోషల్ మీడియా నడిపేది ఎవడో తెలిస్తే ఖైరతాబాద్ సెంటర్లో బట్టలిప్పి కొడతా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. సమస్యలపై పోరాడితే తప్పులేదు.. కానీ వ్యక్తిగత అంశాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇద్దరు కలెక్టర్లకు పది సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. తిట్టినా తప్పేంటి అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. నేను తిట్టింది గత ప్రభుత్వంలో ఇప్పుడు కాదు అని ఆయన అన్నారు.
Also Read: హైడ్రా సెంచరీ.. ఇకపై ఫోకస్ వాటిపైనే
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను.. అననివి అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈరోజు వార్నింగ్ ఇస్తున్నా.. తేడా వస్తే తాట తీస్తా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైటర్స్.. బీఆర్ఎస్ నేతలు ఇలానే వ్యవహరిస్తే.. మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం అని హెచ్చరించారు. కేటీఆర్ డబుల్ లచ్చా.. చిట్టి నాయకుడు కాదు.. రేవంత్ రెడ్డి గట్టి రెడ్డి అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన ఛాంబర్లో తొడగొడితే.. కేటీఆర్‌కు కాళ్లు ఒణుకుతాయి.. జగ్గారెడ్డి మాటే శాసనం అంటూ ఫైర్ అయ్యారు.