Kethireddy: అన్న జగన్.. చెల్లి షర్మిల మధ్య వార్ ముదురుతోంది. అన్నకు కౌంటర్లు ఇవ్వడంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి. జగన్ ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. MOU కాపీలను బయటపెట్టడంతో పాటు బహిరంగ లేఖలు రాస్తూ ఆస్తుల విషయంలో షర్మిల అగ్రిసెవ్ గా ముందుకెళ్తున్నారు. తన అన్న మీడియాలో వచ్చిన కథనాలపైనా షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిన్న ఆ ఆర్టికల్ ను ఖండిస్తూ ఓపెన్ లెటర్ విడుదల చేసింది. ఆ లెటర్ లో షర్మిల కీలక విషయాలను ప్రస్తావించారు. ఆస్తుల పంపకం, విడిపోదాం అని జగన్ ప్రపోజల్ తో సహా అనేక అంశాలను ఆ లేఖలో షర్మిల రాసుకొచ్చారు.
జగన్మోహన్ రెడ్డి షర్మిల ఆస్తిపంపకాల విషయంపై కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ చెల్లెలు షర్మిలకు ఆస్తి పంపకాల విషయంలో ఎలాంటి నష్టం చేయలేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు, మూడు నెలలకు జగన్మోహన్ రెడ్డి షర్మిలను పిలిచి నాన్న గారివి, తాతగారివి ఆస్తులు కాకుండా నేను సొంతంగా సంపాందించుకున్న ఆస్తులు, నేను పెట్టుబడి పెట్టగా వచ్చిన లాభాల్లో షేర్ ఇస్తున్నానని చెప్పారన్నారు. సాక్షీలో కూడా షర్మిలకు షేర్లు ఇవ్వడం జరిగింది. భారతీతో పాటు.. మిగతా మరి కొన్ని సంస్థల్లోనూ షేర్లు జగన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
Also Read: జగన్ వర్సెస్ షర్మిల ఆస్తుల వివాదం.. కేవీపీ నోరు విప్పుతారా?
జగన్ షర్మిలమ్మను ఒక సొంత కూతురిలాగా చూసుకున్నారని అన్నారు. మూడు నెలల క్రితం విజయమ్మ.. జగన్ దగ్గరికి వెళ్లి షర్మిల MOU కాఫీలపై ఉన్నఆస్తి పంపకాలకు సంబంధించిన షరతును చూసి ఆవేదనకు గురయ్యారని అన్నారు. విజయమ్మ ఆస్తులు తన పేరు మీద రాయించాలని జగన్‌ను కోరింది. జగన్ ఆస్తులను విజయమ్మ పేరు మీద రాయగా.. తన షేర్స్ పోయినట్లు షర్మిల ప్రచారం చేస్తున్నారని కేతిరెడ్డి తెలిపారు.
ఇప్పటికే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే.. మరో పక్క కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పాపం జగన్మోహన్ రెడ్డి రజినీ కాంత్ సినిమాలో పెదరాయుడు పంచినట్టు.. చెల్లెమ్మా అవి తీసుకో ఇవి తీసుకో అంటే.. ఈమె బాలకృష్ణ సినిమాలో భానుమతి పొడిసినట్టు పొడిచి పడేస్తాంది అని సెటైరికల్ కామెంట్స్ చేశారు కేతి రెడ్డి. షర్మిల నువ్వొక కమెడీయన్ డ్రామాలు అపేయ్ అంటూ మండి పడ్డారు.