Pregnant Teen Murder| యుక్త వయసులో ప్రేమ, వ్యామోహానికి మధ్య తేడా తెలియకుండా హద్దులు దాటడంతో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటిదే ఒక కేసులో ఒక 19 ఏళ్ల అమ్మాయి ఒక యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ చాలా కాలంగా కలిసి ఉండడంతో ఆమె గర్భవతి అయింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇలాంటి కేసులు దేశంలో ఎన్నో జరుగుతూ ఉన్నా.. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక టీనేజ్ అమ్మాయి కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఆ అమ్మాయి హత్యకు గురికావడమే దీనికి ప్రధాన కారణం.
దేశ రాజధాని ఢిల్లీలో నివసించే సోని అనే 19 ఏళ్ల అమ్మాయి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 6000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఢిల్లీలోని నాన్‌గ్లోయి ప్రాంతానికి చెందిన సోని తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లో ప్రతిరోజు తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ పోస్ట్ లకు భారీ సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. అయితే ఆమెకు కొంత కాలం క్రితం ఒక యువకుడితో పరిచయమైంది.
అతనిలో నిత్యం ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో ఆమె తల్లిదండ్రులకు ఆమె ప్రవర్తన వింతగా అనిపించేది. ఎవరితో మాట్లాడుతున్నావ్? అని అడిగితే తన కొత్త ఫ్రెండ్ అని చెప్పేది. ఆ ఫ్రెండ్ పేరేంటి? అంటే ఘోస్ట్ అని సమాధానం చెప్పేది.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
అయితే అనుకోకుండా అయిదు రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరిన సోని తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోని మిస్సింగ్ కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు ఆమె ఫోన్ నెంబర్ డేటా ట్రాక్ చేశారు. అందులో ఆమె తరుచూ మాట్లాడుతున్న నెంబర్ ని ట్రేస్ చేస్తే.. ఆ నెంబర్ సంజు అలియాస్ సలీం అనే యువకుడిది అని తెలిసింది.
సంజు కోసం పోలీసులు వెళితే.. అతను నాలుగు రోజులుగా ఇంటికి రాలేదని తెలిసింది. దీంతో పోలీసులు అతని ఫోన్ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేయగా.. అతను హర్యాణాలోని రోహ్‌తక్ నగరంలో ఉన్నట్లు తెలిసింది. సోనీ మిస్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు, హర్యాణా పోలీసులకు సమాచారం అందించారు. హర్యాణా రోహ్ తక్ పోలీసులు వెంటనే సంజుని పట్టుకున్నారు. ఢిల్లీ పోలీసులు.. సంజుని అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించగా అప్పుడు విషయం బయట పడింది.
సోని, సంజు గత సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నారు. సంజు సరైన ఆదాయం లేకపోవడంతో అతను జీవితంలో బాగా డబ్బు సంపాదించేంత వరకు తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పకూడదని అనుకన్నాడు. మరోవైపు సోనీ గర్భవతి అయింది. దీంతో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకుందామని సంజుపై సోని తీవ్ర ఒత్తిడి చేసేది. గత సోమవారం సోని ఇంటి నుంచి బయలుదేరి సంజుతో గొడవ పడింది. దీంతో పట్టరాని కోపంలో సంజు ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత తన ఇద్దరు స్నేహితుల సహాయంతో సోని శవాన్ని రోహ్‌తక్ తీసుకెళ్లి అక్కడ ఊరి చివర నిర్మానుష ప్రాంతంలో పాతిపెట్టాడు.
పోలీసులు ప్రస్తుతం సోని శవాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం కోసం తరలించారు. 19 ఏళ్ల సోని ఏడు నెలల గర్భవతి అని తెలిసింది. సోని హత్య కేసులో పోలీసులు సంజు, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. మరో స్నేహితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.