White Hair: నేడు మారిన జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రంగు మారుతోంది. ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యంతో పాటు మరికొన్ని కారణాలు కూడా జుట్టు రంగు మారేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో జుట్టు నల్లగా మారడానికి బయట మార్కెట్‌లో దొరికే హెయిర్ డైలను వాడుతుంటారు. కానీ వీటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
అంతే కాకుండా కొంత మందికి వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. అందుకే నేచరల్ రెమెడీస్ వాడటం మంచిది. వీటి వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా మందంగా మారుతుంది. అసలు తెల్ల జుట్టు రావడానికి గల కారణాలేంటి ? రంగు మారిన జుట్టును ఎలా నల్లగా మార్చుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల వెంట్రుకలు రావడానికి గల కారణాలు:
1. వంశపారంపర్యం
2. పోషకాహార లోపం
3. టెన్షన్
4. కాలుష్యం
5. కొన్ని రకాల వ్యాధులు
6.మందుల వాడకం
7. పెరిగిన వయస్సు
జుట్టు నల్లగా మార్చే నేచురల్ రెమెడీస్..
ఉసిరికాయ: ఉసిరికాయ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. వెంట్రుకలను నల్లగా మార్చడంతో పాటు వాటిని దృఢంగా మార్చుతుంది. ఉసిరి పొడి లేదా తాజా ఉసిరికాయ పేస్టును జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రంగు నల్లబడుతుంది. అంతే కాకుండా ఉసిరికాయలోని పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. తెల్ల జుట్టు నల్లగా మార్చడంలోనూ ఉపయోగపడతాయి.
నిమ్మకాయ: నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది.ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిమ్మరసాన్ని తేనెతో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా వీటిలోని పోషకాలు జుట్టు బలంగా మారేలా చేస్తాయి. జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తాయి.
కాఫీ: కాఫీలో ఉండే పోషకాలు జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి. కాఫీ పౌడర్‌ని కాస్త నీళ్లలో వేసి మరిగించి, దానిని జుట్టుకు అప్లై చేయండి. తరువాత జుట్టును వాష్ చేసుకోండి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు రంగు నల్లబడుతుంది.
బాదం నూనె: బాదం నూనె జుట్టుకు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా బలాన్నిస్తుంది . హెన్నాను బాదం నూనెతో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.
ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది.ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా జుట్టు నల్లగా మారేలా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.
పసుపు: పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పెరుగులో పసుపు కలిపి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.
Also Read: కరివేపాకుతో హెయిర్ మాస్క్.. ఇది వాడితే జుట్టు రాలే సమస్యే ఉండదు
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
ఈ చర్యలను క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ప్రతి వ్యక్తి యొక్క జుట్టు భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒకే రకమైన పరిష్కారం అందరికీ ప్రయోజనం కలిగించదు.
వీటిలో ఏదైన ప్రయత్నించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి.
మీకు ఏదైనా అలెర్జీ ఉంటే, ఈ నివారణలకు దూరంగా ఉండండి.
ఏదైనా సహజ నివారణను ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం కూడా చాలా ముఖ్యం.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.