Karthika Deepam : బుల్లితెరపై వచ్చే సీరియల్స్ కి జనాలు ఎంతలా అడిక్ట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనసు మమత, చక్రవాకం, మొగలిరేకులు వంటి సీరియల్స్ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా… ఇప్పటికీ ఆ సీరియల్స్ లోని క్యారెక్టర్ లను ఇంకా గుర్తు పడుతున్నారు అంటే ఆ సీరియల్స్ , ఆ క్యారెక్టర్స్ జనాల లోకి ఎంతగా వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. ఆ సీరియల్స్ తర్వాత ఇప్పుడు అంతే పాపులారిటీ సొంతం చేసుకున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే అది కార్తీకదీపం (Karthika Deepam) మాత్రమే అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సీరియల్ కి వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్ద, పండు ముసలి వారు ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు.
ముఖ్యంగా కరోనా కాలం నుంచి ఈ సీరియల్ కి విపరీతమైన క్రేజ్ లభించింది. కార్తీక దీపం పూర్తయిన తర్వాత కూడా దానికి సీక్వెల్ గా నవ వసంతం పేరిట మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు బుల్లితెర సీరియల్స్ చరిత్రలో సీక్వెల్స్ రావడం చాలా అరుదు. అలాంటిది ఈ సీరియల్ కి సీక్వెల్ వచ్చింది అంటే ఇక ఎంతలా టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.
దేశంలో నెంబర్ వన్ టీఆర్పీ రేటింగ్..
కుటుంబ కథా నేపథ్యంలో వచ్చిన ఈ కార్తీకదీపం సీరియల్ మొత్తం 949 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. గుత్తా వెంకటేశ్వరరావు ప్రొడ్యూస్ చేయగా కాపుగంటి రాజేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రేమీ విశ్వనాథ్ వంటలక్కగా, నిరూపమ్ పరిటాల డాక్టర్ బాబుగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. 2017లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పుడు సీక్వెల్ ప్రసారమవుతోంది. ఇదిలా ఉండగా డాక్టర్ బాబు, వంటలక్క కలవాలి అని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. అయితే గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఎపిసోడ్ లో డాక్టర్ బాబు వంటలక్క మెడలో తాళి కట్టేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ముఖ్యంగా టీఆర్పీ రేటింగ్ కూడా ఆ ఎపిసోడ్కి విపరీతంగా పెరిగిపోయింది.
డాక్టర్ బాబు ఫ్యాన్సా మజాకా…
ఈ షో కి ఎంత పాపులారిటీ లభించింది అంటే ఒక యూత్ స్టార్ అంతా కలిసి సీరియల్ మళ్లీ ప్లే చేసుకొని డాక్టర్ బాబు ,వంటలక్క మెడలో తాళి కడుతున్న సన్నివేశాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హారతులు పట్టి , కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. డాక్టర్ బాబు ఫ్యాన్సా మజాకా అంటూ ఆయన అభిమానులు ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవడం చూసి మిగతావారు సైతం నోరెళ్ళబెడుతున్నారు. ఏది ఏమైనా డాక్టర్ బాబు క్యారెక్టర్ లో నిరూపమ్, వంటలక్క క్యారెక్టర్ లో ప్రేమీ విశ్వనాధ్ బాగా ఒదిగిపోయారని చెప్పవచ్చు. ప్రస్తుతం వీరిద్దరూ కలవడంతో వీరి అభిమానులు చేస్తున్న హడావిడి మామూలుగా లేదనడంలో సందేహం లేదు. అందుకే ఇంత అభిమానులు ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఈ సీరియల్ విపరీతమైన టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.
View this post on Instagram