EPAPER

Samantha: రెండో పెళ్లిపై క్లారిటీ.. శభాష్ సామ్ అంటున్న నెటిజన్స్..!

Samantha: రెండో పెళ్లిపై క్లారిటీ.. శభాష్ సామ్ అంటున్న నెటిజన్స్..!

Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఏమాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత మహేష్ బాబు(Mahesh Babu) దూకుడు(Dookudu )సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒక్క చిత్రం ఆమె జీవితాన్ని మార్చేసింది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ఎంతోమంది తెలుగు స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్న సమంత నాగచైతన్యను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు అని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు ఈ జంట.


సిటాడెల్ వెబ్ సిరీస్ లో ఎంతో కష్టపడింది..

ఆ సమయంలో సమంత ఎన్నో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంతోమంది ఆమెను అవమానించారు. ట్రోల్ చేశారు. అయినా సరే వేటికి ఆమె భయపడలేదు. తనను తాను మరింత స్ట్రాంగ్ చేసుకుంది. ఇక నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ – హనీ బన్నీ (Honey Bunny) లో నటించినది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమె పడ్డ కష్టం వర్ణనాతీతం. అంతేకాదు ఈమె ఎన్ని కష్టాలు పడింది.. ఎంత స్ట్రగుల్ ఎదుర్కొంది.. అనే విషయాలను సిటాడెల్ దర్శకుడు రాజ్ (Director Raj) మీడియాతో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఇతడితో ఈమె ఎఫైర్ పెట్టుకుంది అంటూ కూడా కొన్ని వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేకపోయింది.


సమంత రెండో పెళ్లి అంటూ వార్తలు..

ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగచైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాలతో ఏడడుగులు వేయబోతున్నారు.అందులో భాగంగానే శోభిత ధూళిపాల ఇంట్లో పెళ్ళికి ముందు జరిగే పసుపు దంచడం , గోధుమ రాయి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది కూడా. ఇలాంటి సమయంలో సమంత కూడా ఇంకో వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై సమంత క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

మళ్ళీ వివాహం పై ఊహించని ప్రశ్న..

అసలు విషయంలోకి వెళ్తే.. సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ నవంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సమంతతో పాటు దర్శకులు రాజ్ అండ్ డీకే కూడా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నారు. సమంత కూడా పలు ప్రెస్ మీట్ లలో పాల్గొంటున్న నేపథ్యంలో తనకు కూడా రెండో పెళ్లి పై వార్తలు ఎదురవ్వగా చాలా ధైర్యంగా సమాధానాలు చెప్పింది. ఇంటర్వ్యూలో భాగంగా రెండవ వివాహం గురించి ప్రశ్న ఎదురవగా ఓపికగా స్పందించింది సమంత.

తోడు అవసరం లేదంటూ షాకింగ్ రిప్లై..

సమంత మాట్లాడుతూ.. నేను ప్రేమించి ఇష్టపడి వివాహం చేసుకున్నాను. కానీ ఇప్పుడు విడిపోయాను. ఇక జీవితంలో రెండో వివాహం గురించి నేను ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు అంటూ స్పష్టంగా చెప్పింది. సమంత ఆత్మ విశ్వాసంతో చెప్పిన తీరుకి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. విడాకుల తర్వాత సమంత మరింత స్ట్రాంగ్ అయిందంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత స్ట్రాంగ్ గా ఎదగాలని, వరల్డ్ వైడ్ పాపులారిటీ సొంతం చేసుకోవాలని కూడా చెబుతున్నారు.

Related News

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

×