IND VS NZ: టీం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో… రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఆల్ అవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసిన న్యూజిలాండ్… రెండు వైన్నింగ్స్ లో 255 పరుగులకు అలౌట్ అయింది.
దింతో టీం ఇండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా బౌలర్లలో… రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందరి 4 వికెట్లు పడగొట్టాడు. అటు జడేజాకు 3 వికెట్లు పడ్డాయి.
న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ లాథం 86 పరుగులు చేసి రాణించాడు. అలాగే కాన్వే 17 పరుగులు చేశాడు. విల్ యంగ్ 23 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో రెచ్చిపోయిన రచిన్ రవీంద్ర 9 పరుగులకే అవుట్ అయ్యాడు. మిచెల్ 18 పరుగులు, టామ్ 41 పరుగులు అలాగే గ్లెన్ ఫిలిప్స్ 48 పరుగులతో రాణించారు.