Satyabhama Today Episode October 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. క్రిష్ తో సత్య చనువుగా ఉండటం చూసిన సంజయ్ సహించలేక పోతాడు. వీరిద్దరినీ ఎలాగైన విడగొట్టాలని అనుకుంటాడు. ఇక రాత్రి క్రిష్ కోసం మహాదేవయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది బాపు నువ్వు ఇంకా నిద్ర పోలేదా అని అడుగుతాడు. లేదు రా నీకోసమే చూస్తున్న అని అంటాడు. ఏమైంది బాపు ఏదైనా అర్జెంట్ నా అని అడుగుతాడు. అదేం లేదు రా నువ్వు పగలు దొరకడం లేదు.. నీకు ఎన్నో పనులు ఉంటాయి. నేనొక్కడిని కాదుగా నీకు చాలా మంది ఉంటారు. ఈ డొంక మాటలు ఎందుకు అని క్రిష్ మహాదేవయ్యతో అంటాడు. రేపు మనం నరసింహ కన్నా ముందే అధిష్టానంను కలవడానికి వెళదామని అంటాడు. అలాగే బాపు అంటాడు. అది సత్య వింటుంది నేను హైదరాబాద్ కు వస్తానని అడుగుతుంది. అతి కష్టం మీద సత్య క్రిష్ ను ఒప్పిస్తుంది. హైదరాబాద్ కు వెళ్ళడానికి రెడీ అవుతారు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య మహాదేవయ్య క్రిష్ తో మాట్లాడిన మాటలను వింటుంది. మళ్లీ క్రిష్ ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాడని క్రిష్ ను ఎలాగైనా కాపాడుకోవాలని ప్లాన్ వేస్తుంది. దానికి మహాదేవయ్య దగ్గరకు వెళ్తుంది. ఏమైంది విన్నావా.. నీకన్నా నీ పదవి కన్నా నాకు ఎక్కువ కాదని క్రిష్ అన్నాడు. నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుంటే రేపు మారణ హోమం జరుగుతుందని అంటాడు. నేను కేవలం వెనుక ఉండి నడిపిస్తాను. క్రిష్ అక్కడ అంతా చేస్తాడు. నేను సేఫ్ అన్నట్లు మాట్లాడుతాడు. దానికి సత్య మీ కోసం క్రిష్ ను బలి చేస్తారా.. కొంచెం కూడా మీకు జాలి లేదా అని అడుగుతుంది. కుక్కలాగా విశ్వాసంగా ఉంటే ఆడికి సేఫ్ లేకుంటే తోక జాడిస్తే ఇక అవసరం లేదు బలి తప్పదు అన్నట్లు మహాదేవయ్య సత్య అంటాడు. ఈ గండం లోకి క్రిష్ ను తీసుకొని వెళ్లనివ్వను అంటుంది. ఇక క్రిష్ తో రాత్రి సరదాగా గడుపుతారు.
అటు సంజయ్ సత్యను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఇక ఉదయం లేవగానే మహాదేవయ్య హైదరాబాద్ ప్రయాణానికి సిద్ధంగా ఉంటాడు. క్రిష్ వస్తాడా, రాడా అని ఆలోచిస్తూ కాఫీ తాగుతాడు. అప్పుడే సంజయ్ అక్కడికి వస్తాడు. హాయ్ బీడీ అంటాడు. బీడీ ఏంటి రా అని అడిగితే బిగ్ డాడ్ అంటాడు. వాడికి కూడా కాఫీ ఇవ్వు అని భైరవితో అంటాడు. వాడు మన ఇంట్లో మనిషే కదా కాఫీ తీసుకురా అనేసి మహాదేవయ్య అంటాడు. దానికి సంజయ్ వద్దు తాగాను అంటాడు. భైరవీ వాడు ఎప్పుడో ఉదయం తాగాడు అంటుంది.
టైం అవుతుంది చిన్నా గాడు వస్తాడా రాడా అని ఆలోచిస్తాడు. సంజయ్ సరదాగా వేసిన జోకులకు భైరవి కౌంటర్లు వేస్తుంది. ఇక సత్య ఆలోచిస్తుంది. ఆలోచించకు ఇక వెళ్తున్నాం కదా అంటాడు. ఇద్దరు కలిసి కిందకు వస్తారు. భైరవి ఇద్దరం పోతున్నాం అంటే వాళ్ళు ఏదో పనిమీద వెళ్తున్నారు నువ్వెందుకు అంటుంది. రానివ్వు మొగుడును కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కదా ఆ మాత్రం బెంగ ఉంటుంది. అని మహాదేవయ్య అనగానే భైరవి నోరుమూసుకుంటుంది.. ఇక సత్య వెళ్తుంటే సంజయ్ మాత్రం ఫీల్ అవుతాడు. క్రిష్ గాడు వెళ్తున్నాడు నిన్ను నా సొంతం చేసుకుందామని అనుకున్న తప్పించుకుంటుంన్నావు నేను వదలను కదా అంటాడు. ఇక వారితో కలిసి హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ అడుగనా సత్యను టార్చర్ చేస్తాడు. ఎలాగైనా లొంగాలని ఒత్తిడి చేస్తాడు. ఇక నామినేషన్స్ లో మహాదేవయ్యకు సీటు కన్ఫర్మ్ అవ్వగానే అందరు సరదాగా బయటకు వెళ్తారు. వాటర్ ఫాల్స్ కు వెళ్లి క్రిష్ సత్య సరదాగా ఉండటం సంజు చూడలేడు. సత్యను ఎలాగైనా లోబర్చుకోవాలని చూస్తాడు. ఇక వండర్ లా లో సరదాగా డ్యాన్స్ లు వేస్తారు. సత్య వెళ్తుంటే సంజయ్ ఆపుతాడు. నిన్ను చూడగానే నచ్చేసావు. ని అందానికి ప్లాట్ అయ్యాను అని అంటాడు. సీక్రెట్ ఎఫైర్ స్టార్ట్ చేద్దామని అంటాడు. నా లైఫ్ ధన్యం అవుతుందని అనగానే సత్య చెంప పగలగొడుతుంది. క్రిష్ చూస్తాడు.. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..