EPAPER

Flipkart Youtube Shopping: ఇక యూట్యూబ్ నుంచి ఫ్లిప్ కార్ట్, మింత్ర షాపింగ్.. కంటెంట్ క్రియేటర్లకు జాక్‌పాట్

Flipkart Youtube Shopping: ఇక యూట్యూబ్ నుంచి ఫ్లిప్ కార్ట్, మింత్ర షాపింగ్.. కంటెంట్ క్రియేటర్లకు జాక్‌పాట్

Flipkart Youtube Shopping| ప్రముఖ ఫ్రీ వీడియో స్టేమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ శుక్రవారం ఇండియాలో యూట్యూబ్ షాపింగ్ పేరుతో కొత్త అఫ్లియేట్ మార్కెటింగ్ ప్రొగ్రామ్ ప్రారంభించింది. దీంతో యూట్యూబ్ క్రియేటర్స్ కొత్త ఆదాయ మార్గం లభించినట్లే. ఈ అఫ్లియేట్ మార్కెటింగ్ ప్రొగ్రామ్ ఇంతకుముందే అమెరికా, సౌత్ కొరియా లాంటి దేశాల్లో యూట్యూబ్ లాంచ్ చేసింది.


యూట్యూబ్ అఫ్లియేట్ మార్కెటింగ్ తో అర్హులైన కంటెంట్ క్రియేటర్లు ఫ్లిప్ కార్ట్, మిత్ర లోని కొన్ని బ్రాండ్స్ ను తన వీడియోల ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ బ్రాండ్స్ ప్రమోషన్ యూట్యూబ్ వెబ్, యూట్యూబ్ మొబైల్ యాప్, కనెక్టెడ్ టీవీల్లో ని అందుబాటులో ఉంటుంది. యూట్యూబ్ హారిజాంటల్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్ రెండింటి ద్వారా బ్రాండ్ ప్రమోషన్ చేయవచ్చు.

యూట్యూబ్ షాపింగ్ ఎలా పనిచేస్తుంది?
శుక్రవారం అక్టోబర్ 25, 2024న ప్రారంభమైన యూట్యూబ్ షాపింగ్ ప్లాట్ ఫామ్ లో వీడియో క్రియేటర్లు సైన్ అప్ చేసుకోవాలి. ఆ తరువాత యూట్యూబ్ వారి అప్లికేషన్ ని పరిశీలించి ఆమోదిస్తుంది. ఆమోదం పొందిన తరువాత వీడియో క్రియేటర్లు ఫ్లిప్ కార్ట్, మింత్ర లాంటి ఈ కామర్స్ లో లభించే ప్రాడక్ట్స్ ని, వాటిని విక్రయించే రిటైలర్స్ ని తమ వీడియోల్లో, షార్ట్స్ లో, లైవ్ స్ట్రీమింగ్స్ లో ట్యాగ్ చేయవచ్చు.


మరోవైపు యూట్యూబ్ ప్రేక్షకులు కూడా ఈ ప్రాడక్ట్స్ ని వీడియోని క్లోజ్ చేయకుండా వీక్షించే అవకాశం ఉంది. వీడియో చూసే ప్రేక్షకుడు ఛానెల్ లేదా వీడియోలో ఏదైనా ప్రాడక్ట్ లింక్ చూసి దాన్ని క్లిక్ చేస్తే.. అది నేరుగా రిటైలర్ (ప్రస్తుతానికి మింత్ర, ఫ్లిప్ కార్ట్) వెబ్ సైట్ కు నావిగేట్ చేస్తుంది. అలా లింక్ ద్వారా వెళ్లిన ప్రేక్షకుడు ప్రాడక్ట్ కొనుగోలు చేస్తే.. వీడియో క్రియేటర్ కు కొనుగోలు మొత్తంపై కంపెనీ కమిషన్ ఇస్తుంది. ఆ కమిషన్ ఎంత లభిస్తుందో ముందుగానే ప్రాడక్ట్ ట్యాగ్ చేసే సమయంలో వీడియో క్రియేటర్లకు సూచించబడతాయి. క్రియేటర్లు ఒక్కో వీడియోలో అత్యధికంగా 30 ప్రాడక్ట్స్ ట్యాగ్ చేయవచ్చు.

Also Read: సౌదీలో ప్రపంచంలోని అతి పెద్ద బిల్డింగ్ నిర్మాణం ప్రారంభం.. దీని కొలతలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

యూట్యూబ్ షాపింగ్ విభాగం జెనెరల్ మేనేజర్ ట్రావిస్ కట్జ్ మాట్లాడుతూ.. ”ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ షాపింగ్ విజయవంతమైంది. కేవలం 2023లోనే యూట్యూబ్ షాపింగ్ కు సంబంధించి.. 30 బిలియన్ అవర్స్ వీడియో కంటెంట్ ని ప్రేక్షకులు చూశారు. దీనిబట్టి కంటెంట్ క్రియేటర్స్‌, ప్రేక్షకులు, బ్రాండ్స్, మధ్య గట్టి బాండింగ్ ఉన్నట్లు అర్థమవుతోంది”, అని అన్నారు.

యూట్యూబ్ షాపింగ్ కు క్రియేటర్లకు ఉండాల్సిన అర్హత
అఫ్లియేట్ మార్కెటింగ్ ప్రొగ్రాంకు సైన్ అప్ చేసుకోవాలంటే యూట్యూబ్ వీడియో క్రియేటర్లకు కొన్ని కండీషన్స్ ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానెల్ ఇండియాలో ఉండాలి. ఆ ఛానెల్ కు 10,000 కు పైగా సబ్స్‌క్రైబర్లు ఉండాలి. కిడ్స్ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ కు యూట్యూబ్ షాపింగ్ అర్హత ఉండదు. స్ట్రైక్స్ ఉన్న ఛానెల్స్ కు యూట్యూబ్ షాపింగ్ ఫీచర్ నిలిపివేయబడుతుంది. కాపీ కంటెంట్, క్లెయిమ్ ఉన్న కంటెంట్ వీడియోలపై ఈ షాపింగ్ ప్రాడక్ట్స్ ట్యాగ్స్ డిస్ ప్లేకి అనుమతి ఉండదు.

Related News

Scenic Train Journey India: దేశంలో అత్యంత అందమైన రైల్వే ప్రయాణాలు.. లైఫ్ లో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాల్సిందే!

Gold Rate Today: పండగ వేళ బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే..

Viral Video: రన్నింగ్ ట్రైన్ లో పాము, నెట్టింట వీడియో వైరల్

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర

Richest People In World 2024: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే, ఒక్కొక్కరి ఆస్తుల విలువెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Cable TV Price Hike: మొబైల రిచార్జ్ పెంపు తర్వాత ఇక కేబుల్ టీవి ధరలు పైపైకి.. సామాన్యుడిపై మరింత భారం!

×