Gundeninda GudiGantalu Today Episode 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాను మర్చిపోలేక, రవి చేసిన మోసం తల్చుకుంటూ వాళ్లిద్దరి మీద కోపంతో రవి బార్ కు రాజేజ్ ను తీసుకొని వెళ్తాడు. అక్కడ మందు తాగుతుంటే ఒక అతను తాను తిట్టినందుకు భార్య చనిపోయిందని ఫీల్ అవుతాడు. తన వల్ల భార్య ఉరివేసుకిందని చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోకండి. చేసుకున్నా పెళ్ళాలను తిట్టకండి అని అంటాడు. తిడితే చనిపోతారు అంటాడు. దానికి బాలు మోసం చేస్తే ఎలా ఒప్పుకుంటారు అని అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని రాజేష్ తో చెబుతాడు. మనిద్దరం తాగి ఉన్నాం కదా ఎవరు తీసుకెళ్తారు అంటే కార్తిక్ గాడి ఇల్లు పక్కనే తీసుకొని వెళదామని వెళ్తాడు. కారులో వెళ్తూ మీనాకు ఏమైందో అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. మీనా రెస్పాండ్ అవ్వకుంటే బాలు తన పుట్టింటికి వెళ్ళిపోతాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తాగున్నా రాజేష్, బాలు కార్తిక్ లు మీనా ఇంటికి వెళ్తారు. ఇక బయట నుంచి మాట్లాడుకుంటారు. వీరిందరి డైలాగులు కామెడీగా ఉంటాయి.. ఎపిసోడ్ కు బాలు, రాజేష్ లు హైలెట్ అవుతారు. ఇక బాలు రాజేష్ ను లోపలికి వెళ్లమని చెబుతాడు. రాజేష్ తో నేను తాగి ఉన్నాను నువ్వు లోపలికి వెళ్లి బాలు కనిపించలేదు అని చెప్పు అంటాడు. దానికి రాజేష్ కౌంటర్ వేస్తాడు. నువ్వు తాగి వచ్చావా మరి నేను పూజ చేసి వచ్చానా నేను కూడా తాగేసి వచ్చాను అంటాడు. అదే మీనాకు చెప్పు ఇద్దరం బార్ లో తాగాము తర్వాత బాధ పడుతూ ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పు అంటాడు. ఇక రాజేష్ వీరిద్దరి మధ్య పంచ్ డైలాగులు బాగా పేలాయి. ఇద్దరు కలిసి హిలరియస్ గా నవ్విస్తారు.
ఇక మీనా ఇంటి తలుపు కొడతాడు.. మీనా లేదు అన్నట్లు అందరు అబద్దం చెబుతారు. దానికి బాలు టెన్షన్ పడతాడు. తర్వాత మీనా కనిపించడంతో బయటకు వెళ్ళిపోతారు. ఇక మీనా వచ్చి భారీ డైలాగులు కొడుతుంది. ఉదయం చావు అన్నారు ఇప్పుడు వచ్చారు. నా తప్పు లేదని అన్నా వినిపించుకోరే అని నమ్మిస్తుంది.. ఇక బాలు రవిని కొట్టిన విషయం గురించి చెప్పేస్తాడు. ఇక మీనా సేఫ్ గా ఉందని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాలు తాగి రావడం చూసిన సత్యం షాక్ అవుతాడు. నా కొడుకులు ఇలా మారారు అని బాధ పడతారు. అప్పుడు బాలు బాధ పడకు నాన్న నేను బాధను మర్చిపోవాలనే తాగాను అంటాడు. ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇక మనోజ్ వస్తాడు. రోహిణి కూడా వస్తుంది. మనోజ్ బాలు గొడవ పడతారు. బాలు లక్షలు మింగావు.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లక్షలు తీసుకెళ్ళావు.. నువ్వు నన్ను అడుగుతున్నావా అని కొడతాడు. అందరు బాలును ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ బాలు మాత్రం ఆగకుండా కొడతాడు. మధ్యలో వచ్చిన రోహిణిని కొడతాడు..
మనోజ్ తన భార్యనే కొడతావా అని బాలుతో గొడవకు దిగితుంది. ఇక ప్రభావతి బాలును ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ బాలు ఆగకుండా అందరిని కొడతాడు. ఇక సత్యంకు గుండె పోటు రావడంతో అందరు షాక్ అవుతారు. హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు. మామయ్యకు గుండె పోటు రావడంతో మీనా నిద్రలోనే అరుస్తుంది. ఇంట్లో వాళ్లకు చెబుతుంది. ఇక తన అత్తింటికి వెళ్లాలని అనుకుంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో మీనా వస్తుంది. అలాగే రవి, శృతిలు వస్తారు. సత్యం పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది..