Groom Gifts Kitten To Bride: పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైనది. జీవిత భాగస్వామిని ఆహ్వానించే అద్భుతమైన వేడుకను అంగంరంగ వైభవంగా జరుపుకుంటారు. బంధుమిత్రుల ఆశీర్వాదల నడుమ మూడు ముళ్లబంధంతో ఒక్కటవుతారు. పెళ్లి మాట ఎలా ఉన్నా, పెళ్లికి ముందు కాబోయే అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు చాలా ప్రయత్నిస్తారు. అదిరిపోయే గిఫ్టులతో సర్ ప్రైజ్ చేయాలని భావిస్తారు. కొంత మంది విలువైన నగలు ఇప్పిస్తే, మరికొంత మంది చక్కటి దుస్తులు కొనిస్తారు. ఇంకొంత మంది కార్లు, బైకులు ఇప్పిస్తారు. కానీ, ఓ పెళ్లి కొడుకు కాస్త వెరైటీగా ఆలోచించి క్రేజీ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అతడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
పెళ్లి కూతురికి పిల్లి బహుమతి
అందరిలా తానూ రొటీన్ బహుమతులు ఇస్తే ఏం బాగుంది అనుకున్న ఓ పెళ్లి కొడుకు వెరైటీగా తనకు కాబోయే శ్రీమతికి పిల్లిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ‘సరవియా హొస్సేన్’ ఇన్ స్టా గ్రామ్ నుంచి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చక్కగా అలంకరించిన గదిలో వధువు మంచం మీద కూర్చున్నది. బయటి నుంచి గదిలోకి వచ్చిన వరుడు చక్కటి పిల్లిని తీసుకొచ్చాడు. పెళ్లి గిఫ్టు అని చెప్తూ అమ్మాయి చేతిలో పెట్టాడు. ఊహించని బహుమతి చూసి వధువు ఆశ్చర్యపోయింది. పిల్లిని ప్రేమగా తీసుకుని ఫుల్ ఖుషీ అయ్యింది. పక్కనే ఉన్న బంధువులు అబ్బాయి బహుమతి చూసి నవ్వుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అబ్బాయి ఆలోచనను అందరూ కొనియాడుతున్నారు. “మీ భర్త.. కల నిజం చేసినప్పుడు” అనే ట్యాగ్ తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా లైక్స్ సాధించింది.
View this post on Instagram
ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు
పెళ్లి కొడుకు ఇచ్చిన పిల్లి గిఫ్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “పెళ్లైన మొదటి రోజే పిల్లికి తల్లైంది” అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “పిల్లిని బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన చాలా బాగుంది. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె దానితో చక్కగా ఆడుకోవచ్చు” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “హంగు ఆర్బాటాలకు పోకుండా పిల్లిని గిఫ్ట్ గా ఇవ్వడం మంచి నిర్ణయం” అని మరికొంత మంది అభినందిస్తున్నారు. “అబ్బాయిలూ నోట్ చేసుకోండి. మీరు కూడా చేసుకోబోయే అమ్మాయిలకి పిల్లినో, కుక్కనో బహుమతిగా ఇవ్వండి” అని ఇంకో వ్యక్తి సూచించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది.
Read Also: డ్రైనేజీ నీళ్లు, రోడ్డు మీద బురద, బిగ్ బాస్ కంటెస్టెంట్ ను బండ బూతులు తిడుతున్న నెటిజన్లు