EPAPER

Naaga Vamsi: నాకు, త్రివిక్రమ్ గారికి, బాబాయ్ కి ఒక సినిమా నచ్చితే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది

Naaga Vamsi: నాకు, త్రివిక్రమ్ గారికి, బాబాయ్ కి ఒక సినిమా నచ్చితే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది

Naaga Vamsi: కొందరు నిర్మాతలతో కొందరు దర్శకులకి మంచి బాండింగ్ ఉంటుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా కెరియర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన గుర్తింపును సాధించుకొని, తెలుగు సినిమా సంభాషణలను కొత్త పుంతలు తొక్కించాడు. ఒక డైలాగ్ ఇలా కూడా రాయొచ్చు అని తనకంటూ ఒక సెపరేట్ వే క్రియేట్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ పేరు చూసి కూడా సినిమాకి వెళ్లిన ఆడియన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎట్టకేలకు నువ్వే నువ్వే సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతడు అనే సినిమాను చేశాడు త్రివిక్రమ్. దర్శకుడిగా త్రివిక్రమ్ కి మంచి పేరును తీసుకొచ్చిన సినిమా అతడు. ఇప్పటికీ చాలామందికి ఆ రోజుల్లో అతడు సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలా తీశాడు అని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. త్రివిక్రమ్ కెరియర్ లో ఎక్కువ సినిమాలు స్టార్ హీరోస్ తో మాత్రమే చేసాడు.


ఇక త్రివిక్రమ్ సినిమాలకి నిర్మాతగా జులాయి సినిమా వరకు చాలామంది వ్యవహరించారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకి ఒకరే ప్రొడ్యూసర్. అతనే సూర్యదేవర చినబాబు. జులాయి సినిమాతో మొదలైన హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నేడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ బ్యానర్. ఈ బ్యానర్లో ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప ఇంకో దర్శకుడు సినిమా చేయలేదు. కేవలం త్రివిక్రమ్ కోసమే ఈ బ్యానర్ను స్థాపించింది ఆ సంస్థ. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ కూడా ఇంకో బ్యానర్ లో సినిమా చేయడం ఆపేసారు. అయితే ఈ బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ను స్థాపించారు. ఈ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఈ బ్యానర్ లో ఇప్పటివరకు రిలీజ్ అయ్యాయి. జెర్సీ లాంటి నేషనల్ అవార్డ్ సినిమా కూడా ఈ బ్యానర్ లో వచ్చింది.

కేవలం తెలుగు హీరోస్ తో మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్తో కూడా ఈ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఈ బ్యానర్ లో ఏ సినిమా జరిగినా ఖచ్చితంగా త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ బ్యానర్ కి మంచి సక్సెస్ రేట్ ఉంది. రణరంగం, బుట్ట బొమ్మ, రంగదే వంటి కొన్ని కొన్ని సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ కూడా ఈ బ్యానర్లో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఈ బ్యానర్ లో చిన్న బాబు, త్రివిక్రమ్, వంశీ కు నచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయింది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో రాబోతున్న సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమా కూడా వీళ్ళ ముగ్గురికి విపరీతంగా నచ్చిందట. అయితే ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని తన నమ్మకాన్ని తెలిపాడు నాగ వంశీ.


Related News

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

×