EPAPER

Bigg Boss Sita: విష్ణు ప్రియా నిజ స్వరూపం ఇదే.. కిర్రాక్ సీత సంచలన కామెంట్స్..

Bigg Boss Sita: విష్ణు ప్రియా నిజ స్వరూపం ఇదే.. కిర్రాక్ సీత సంచలన కామెంట్స్..

Bigg Boss sita : బుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 8 మొదట గందరగోళంగా మారిన ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుంది. ఈ షోలో ఇప్పటికే ఏడు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఎనిమిదోవ వారం పోరు జరుగుతుంది. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ మొత్తం అన్ లిమిటెడ్ ట్విస్ట్స్ తో ఉంటుందని, ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఒక రేంజ్ లో ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. మొదట్లో కాస్త సైలెంట్ గా సాగిన ఈ షో వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత షో మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వారంతా ఇంటర్వ్యూలు ఇవ్వడం కామన్.. తాజాగా కిర్రాక్ సీత బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయట పెట్టింది.


బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే సీత పేరు గుర్తుకు వస్తుంది. ఆమె సివంగిలా హౌస్ ను తన ఆటతో దడదడ లాడించింది. బిగ్ బాస్ నుంచి ఎవరు ఊహించని విధంగా బయటకొచ్చింది. ఈమె బయటకు వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ తనకు తక్కువ ఓటింగ్ పడటంతో కేవలం ఆరు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వారానికి రెండు లక్షల చొప్పున ఆరు వారాలకు గాను దాదాపు 13 లక్షల వరకు అందుకుంది. ఈమె ఆట సరిగ్గా లేకపోవడంతోనే ఆమెను ఎలిమినేట్ చేశారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె బిగ్ బాస్ బజ్ తో పాటుగా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మీడియా ఛానెల్ బిగ్ బాస్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా సంచలనం విషయాలను బయట పెట్టింది.

సీత మాట్లాడుతూ.. తన ఎలిమినేషన్ గురించి చెప్పింది. అనంతరం బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ గురించి అడగ్గా పృథ్వీ ఎవరిని మోసం చెయ్యలేదు. తాను నాకు ఫ్రెండ్.. అతను విష్ణును వాడుకొని వదిలెయ్యాలని అనుకోలేదు. మొదటి నుంచి అతను అలాగే ఉన్నాడు. అందులో తప్పు లేదు.. మొత్తం విష్ణు ప్రియానే చేసింది. ఆమెకు మొదటి నుంచి క్రష్ ఉంది అని చెబుతుంది. అయితే పృథ్వీ మొదట్లోనే చెప్పాలిగా ఇప్పుడు ఎమోషన్స్ తో ఆడుకోవడం ఏంటి అని అడగ్గా.. దానికి విష్ణు చాలా ఎమోషనల్ ఏదైనా ఎవరి మీదైనా అనిపిస్తే అది చేస్తుంది. ఇది అయ్యింది తానే అని విష్ణు గురించి బయట పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరు కామెంట్స్ చేస్తున్నారు.. మొదటి నుంచి ఫ్రెండ్ అని తిరిగావు ఇప్పుడు ఇలా అన్నావేంటి అంటూ షాక్ అవుతున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి.. ఇక ఈ వారం పృథ్వి ఎలిమినేట్ అవుతాడని ఆల్రెడీ వార్తలు వినిపిస్తున్నాయి.


Related News

Bigg Boss 8 Telugu: గంగవ్వ సంచాలకురాలు ఏంటి బాసు.? టాస్కుల్లో కన్‌ఫ్యూజన్, అవకాశాన్ని వాడుకున్న హరితేజ

Bigg Boss 8 Telugu: సొంత టీమ్‌కు విష్ణుప్రియా వెన్నుపోటు.. పృథ్వి చెప్పిందే జరిగిందిగా!

Bigg Boss 8 Telugu Promo: ఓవరాక్షన్ చేయకు.. గౌతమ్, నిఖిల్ మధ్య గొడవ.. యష్మీ సపోర్ట్ ఎవరికి?

Bigg Boss 8 Telugu : ఇదేం కరువు రా బాబు.. పృథ్వికి విష్ణు ప్రియ స్ట్రాంగ్ వార్నింగ్..

BB Telugu 8 Diwali Special : దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ఆకట్టుకున్న సమీరా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!

BB Telugu 8 Promo: బీబీ ఇంటికి దారేది.. కొత్త టాస్క్ తో మరో ఛాలెంజ్..!

Bigg Boss 8 Telugu: ఇవెక్కడి నామినేషన్స్.. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా జరగడం మొదటిసారి!

×