EPAPER

Bigg Boss Gangavva : గంగవ్వ కేసులో షాకింగ్ తీర్పు… ఇలాంటిది అస్సలు ఊహించలేదు..

Bigg Boss Gangavva : గంగవ్వ కేసులో షాకింగ్ తీర్పు… ఇలాంటిది అస్సలు ఊహించలేదు..

Bigg Boss Gangavva : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుంది. ఇలాంటి టైం ఆడియన్స్ షాక్ అయ్యే ఘటన ఒకటి ఎదురైంది. ఈ షోలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ తన మాటతో ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె విన్నర్ అవ్వాలని కోట్ల మంది అభిమానులు కోరుకుంటూన్నారు. గత సీజన్ లో కూడా అవ్వ పాల్గొని అనారోగ్య సమస్యల కారణంగా మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక ఈ సీజన్ లో మాత్రం గట్టి పోటీని ఇస్తూ దూసుకుపోతుంది. టాస్కులు మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే పెద్దగా ఆడలేకపోతున్నప్పటికీ, ఎంటర్టైన్మెంట్ అందించే విషయంలో మాత్రం గంగవ్వ ఏమాత్రం తగ్గడం లేదు. హౌస్ కి ఒక పెద్ద దిక్కుగా ఆమె మారిపోయింది. అలాంటి గంగవ్వకు కోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది.. ఆ పిచ్చి పనే అవ్వ మెడకు చుట్టుకుంది. తాజాగా గంగవ్వ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. అసలు వివరాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


బిగ్ బాస్ లో గంగవ్వకు దెయ్యం పట్టిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. నిజంగా దెయ్యం పడితే ఎలా ఉంటుందో హౌస్ మేట్స్ అందరినీ ఎంతలా భయపెట్టిందో మనమంతా చూసాము. ఇప్పటికీ ఇది ప్రాంక్ అనే విషయం హౌస్ మేట్స్ కి తెలియదు. అంతలా జీవించేసింది గంగవ్వ. అయితే ఈ ఎపిసోడ్ జరిగిన మరుసటి రోజు ఆమె పై కేసు నమోదు అయ్యిందని, పోలీసులు ఆమెని అరెస్ట్ చెయ్యడానికి వస్తారని రెండు రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా మరో న్యూస్ వినిపిస్తుంది..

దెయ్యం పట్టినట్లు గంగవ్వ ప్రాంక్ చేసింది.. కానీ ఆమెకు నిజంగానే దెయ్యం పట్టిందని హౌస్ లో వాళ్లంతా దడుచుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు బాగా భయపడ్డారు. అయితే ఈ ఎపిసోడ్ జరిగిన మరుసటి రోజు ఆమె పై కేసు నమోదు అయ్యిందని, పోలీసులు ఆమెని అరెస్ట్ చేయబోతున్నారని, అందువల్ల ఈ వారం ఆమె సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక వార్త ద్రావనంగా వ్యాపించింది. అయితే ఈ వార్త గురించి ఇపుడు మరో అప్డేట్ వచ్చేసింది. గంగవ్వ ని పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. కేవలం ఆమెకి జరిమానా మాత్రమే విధించారు. ఆమే యూట్యూబ్ ఛానెల్ కోసం చేసిన వీడియోలో చిలుకను హింసించడం వళ్లే ఆమె పై కేసు నమోదు అయ్యింది. దానికి ఆమె కు 25 వేలు జరిమానా విధించారు. ఈ విషయం అక్కడితో క్లోజ్ అయ్యిందని యూట్యూబర్ అనిల్ చెప్పారు. మొత్తానికి ఈ వార్త దుమారం రేపింది.. బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నప్పటికీ, కంటెస్టెంట్స్ పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. అసలు ఈమెని హౌస్ లోకి ఎందుకు తీసుకొచ్చారు?, హౌస్ లో కుర్చీలు, సోఫాలు ఏమి పని చేస్తున్నాయో, గంగవ్వ కూడా అదే చేస్తుంది. ఆమెను పంపించండి అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి..


Related News

Bigg Boss 8 Telugu: గంగవ్వ సంచాలకురాలు ఏంటి బాసు.? టాస్కుల్లో కన్‌ఫ్యూజన్, అవకాశాన్ని వాడుకున్న హరితేజ

Bigg Boss 8 Telugu: సొంత టీమ్‌కు విష్ణుప్రియా వెన్నుపోటు.. పృథ్వి చెప్పిందే జరిగిందిగా!

Bigg Boss 8 Telugu Promo: ఓవరాక్షన్ చేయకు.. గౌతమ్, నిఖిల్ మధ్య గొడవ.. యష్మీ సపోర్ట్ ఎవరికి?

Bigg Boss 8 Telugu : ఇదేం కరువు రా బాబు.. పృథ్వికి విష్ణు ప్రియ స్ట్రాంగ్ వార్నింగ్..

BB Telugu 8 Diwali Special : దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ఆకట్టుకున్న సమీరా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్..!

BB Telugu 8 Promo: బీబీ ఇంటికి దారేది.. కొత్త టాస్క్ తో మరో ఛాలెంజ్..!

Bigg Boss 8 Telugu: ఇవెక్కడి నామినేషన్స్.. బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా జరగడం మొదటిసారి!

×