Border Gavaskar Trophy: బీసీసీఐ పాలక మండలి ( Board of Control for Cricket in India ) కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాతో జరిగే… బోర్డర్ గవాస్కర్ సిరీస్ (Border Gavaskar Trophy ) కోసం టీం ఇండియాను ఫైనల్ చేసింది. అదే సమయంలో సౌతాఫ్రికా ( South Africa ) జరిగే.. టి20 టోర్నమెంట్ జట్టును కూడా ఫైనల్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ). అయితే బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ కు మహమ్మద్ షమీ ( Mohammad Shami ) సెలెక్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ… ఆయన అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
మహమ్మద్ షమీ ( Mohammad Shami ) గాయం తిరగ బడడంతో… ఆస్ట్రేలియా టూర్‌కు సెలెక్ట్ కాలేదు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ కోసం 18 మందితో జట్టును ఫైనల్ చేసింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ ( Rohit Sharma )… కెప్టెన్ గా వ్యవహరించ నున్నాడు. బుమ్రా వైస్ కెప్టెన్ గా కొనసాగుతారు. ఇక అటు… సౌత్ ఆఫ్రికా తో ( South Africa ) జరిగే టి20 మ్యాచ్ లకు కూడా టీమిండియాను సెలెక్ట్ చేశారు. ఈ టోర్నమెంట్లో కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar yadav ) కొనసాగనున్నాడు. వికెట్ కీపర్ గా… సంజు శాంసన్ ( Sanjau samson ) బరిలో ఉంటారు.
Also Read: Glasgow Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె) , R అశ్విన్, R జడేజా, Mohd. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
Also Read: Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !
రిజర్వ్‌లు: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.
భారత జట్టు
దక్షిణాఫ్రికాతో 4 టీ20ల కోసం భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (WK), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ , అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.
Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !
🚨 NEWS 🚨
Squads for India’s tour of South Africa & Border-Gavaskar Trophy announced 🔽#TeamIndia | #SAvIND | #AUSvIND pic.twitter.com/Z4eTXlH3u0
— BCCI (@BCCI) October 25, 2024